కల్కి.. ఆ సర్ ప్రైజ్ మామూలుగా ఉండదట

ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా రెడీ అవుతున్న కల్కి 2898ఏడీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది

Update: 2024-05-25 04:40 GMT

ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా రెడీ అవుతున్న కల్కి 2898ఏడీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో భైరవ పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898ఏడీ మూవీని నిర్మిస్తోంది.

ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. భారీ మల్టీ స్టారర్ చిత్రంగా రాబోతుండటం, అలాగే ఇప్పటి వరకు రానటువంటి కథాంశంతో ఉండటంతో కల్కి కచ్చితంగా ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేస్తుందని సినీ పండితులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ గట్టిగా చేస్తోంది. బుజ్జి గ్లింప్స్ ని తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

అలాగే మూవీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారుని రివీల్ చేశారు. ఈ కారు కోసం ఏకంగా 7 కోట్ల రూపాయిలు ఖర్చు చేసారంట. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూవీలో ప్రభాస్ ఏకంగా 6 విభిన్నమైన పాత్రలలో కనిపిస్తాడంట. భైరవ రోల్ కాకుండా మరో 5 క్యారెక్టర్స్ ని ప్రభాస్ చేసాడంట.

సినిమాలో ఆ క్యారెక్టర్స్ సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ గా ఉండబోతున్నాయని ప్రచారం నడుస్తోంది. కల్కి అవతారం బేస్డ్ గా ఈ మూవీ కథని నాగ్ అశ్విన్ రాసుకున్నారు. అయితే హీరో క్యారెక్టర్ కి భైరవ అని పేరు పెట్టారు. మూవీకి కల్కి అని పేరుని డిసైడ్ చేయడం వెనుక ఒక బలమైన కారణం ఉందట. భైరవ పాత్ర కాకుండా కల్కి రోల్ కూడా ఈ చిత్రంలో ఉంటుందనే మాట చాలా కాలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా 6 క్యారెక్టర్స్ అంటూ ప్రచారం జరుగుతోంది.

ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సిందే. కచ్చితంగా కల్కి2898ఏడీలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. కానీ అవేంటి అనేది పూర్తిగా రివీల్ చేయడం లేదు. ట్రైలర్ రిలీజ్ అయితే అప్పుడు మూవీ కథాంశం ఎలా ఉండబోతుందనేది ఒక స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో అశ్వద్ధామ పాత్రలో అమితాబచ్చన్ కనిపించబోతున్నారు. దీపికా పదుకునే, దిశా పటాని ప్రభాస్ కి జోడీగా నటించారు. కమల్ హాసన్ ప్రతినాయకుడిగా చేశారు.

Tags:    

Similar News