క్రికెట్ + కల్కి.. వ్వాటే కిక్కు!

ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు అమెరికా, వెస్ట్ ఇండీస్ లో జరుగుతున్నాయి.

Update: 2024-06-25 04:04 GMT

ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు అమెరికా, వెస్ట్ ఇండీస్ లో జరుగుతున్నాయి. సూపర్ 8లో ఆస్ట్రేలియాని ఓడించి టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కి చేరుకుంది. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో ఇండియా తలపడనుంది. వన్డే వరల్డ్ కప్ ని కొద్దిలో జారవిడుచుకున్న రోహిత్ సేన ఈ సారి టీ20 వరల్డ్ కప్ ని సొంతం చేసుకోవాలనే కసితో ఆడుతోంది. వరుస విజయాలతో సెమీ ఫైనల్ కి ఇండియా దూసుకుపోయింది. సెమీ ఫైనల్ మ్యాచ్ జూన్ 27న జరగనుంది.

అదే రోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏడీ థియేటర్స్ లోకి రాబోతోంది. భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ప్రపంచ వ్యాప్తంగా 22 భాషలలో కల్కి 2898ఏడీ మూవీ రిలీజ్ కానుంది. కల్కి మూవీతో హాలీవుడ్ లో కూడా తన మార్క్ చూపించడానికి నాగ్ అశ్విన్ సిద్ధమయ్యారు. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా జోరుగా జరుగుతున్నాయి.

మొదటి మూడు రోజులు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, నార్త్ అమెరికాలో ఆల్ మోస్ట్ థియేటర్స్ హౌస్ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. మొదటి రోజు కల్కి 2898ఏడీ 200 కోట్ల గ్రాస్ వసూళ్లు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాపై ఉన్న హైప్ కారణంగా ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడతారని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. జూన్ 27న సినిమా పండగతో పాటు క్రికెట్ పండగ కూడా ఉండబోతోంది.

మ్యాచ్ నైట్ 7 గంటలకి మొదలవుతుంది. ఆ లోపు కనీసం 4 షోలు పడిపోతాయి. దీంతో క్రికెట్ తో కల్కి చిత్రానికి వచ్చే నష్టమేమీ ఉండదని భావిస్తున్నారు. ఇప్పుడు మొబైల్స్ తో కూడా క్రికెట్ లైవ్ అప్డేట్, మ్యాచ్ చూసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి ఒకప్పటిలా క్రికెట్ మ్యాచ్ లు సినిమాలపై ఇంపాక్ట్ చూపించడం లేదు. మంచి సినిమా థియేటర్స్ లోకి వస్తే సినిమా చూస్తూనే క్రికెట్ ని కూడా ప్రేక్షకులు ఆశ్వాదిస్తున్నారు.

జూన్ 27న అయితే డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలకి హద్దు ఉండదు. సలార్ తర్వాత కల్కి 2898ఏడీ మూవీ రాబోతోంది కాబట్టి బాక్సాఫీస్ వద్ద హడావుడి మాములుగా ఉండదు. అయితే సలార్ కి మించి ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి వస్తూ ఉండటంతో ఎలా ఉండబోతోందో చూడాలనే క్యూరియాసిటీ పబ్లిక్ లో కనిపిస్తోంది. మరి సినిమా క్రికెట్ కిక్ లో మిక్స్ అవుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News