కల్కి 2898AD గ్రాఫిక్స్.. నాగ్ అశ్విన్ ఏమన్నారంటే
అతను ఎప్పుడూ కూడా మీడియా ముందుకు వచ్చి హైలైట్ చేసుకోలేదు కానీ అతను చాలా సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు.
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకులు చాలామంది ఉన్నారు. కానీ అందులో సమాజానికి ఉపయోగపడే విధంగా ఆలోచించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అందులో నాగ్ అశ్విన్ ఒకరు. అతను ఎప్పుడూ కూడా మీడియా ముందుకు వచ్చి హైలైట్ చేసుకోలేదు కానీ అతను చాలా సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇప్పటికి తన ఇంటికి కరెంట్ ఉండదు. సోలార్ వాడుతూ.. గ్రీన్ ఎనర్జిని సపోర్ట్ చేస్తుంటాడు.
ఇక అతను పద్ధతులు ఇతరులతో నడుచుకునే విధానం కూడా చాలా గౌరవంగా ఉంటుంది. నాగ్ అశ్విన్ వేల కోట్ల ఆస్తిపరుడైన అశ్విని దత్ అల్లుడు హోదా ఉన్నప్పటికీ కూడా తనకు నచ్చిన సింప్లిసిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇక నాగ్ అశ్విన్ చేసిన సినిమాలను అతని స్వభావం ఏంటో చెబుతాయి. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతోనే అతను మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆ తర్వాత మహానటి సినిమాతో మరింత క్రేజ్ వచ్చింది.
ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ K తో ఇండియన్ సినిమాను మరొక లెవెల్ కు తీసుకునే వెళ్లేలా ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే హైదరాబాద్‌లో ప్రారంభమైన VFX సమ్మిట్ 2023లో దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కల్కి 2898 AD గురించి ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు. 'మేక్ ఇన్ ఇండియా' చొరవ స్ఫూర్తితో భారతదేశంలోనే మొత్తం VFX టెక్నాలజీ ని ప్రాజెక్టు కె కోసం ఉపయోగించాలని మొదట అనుకున్నాను.
ఆ విధంగా పూర్తిగా సాధించబడనప్పటికీ, కల్కి 2898 AD కోసం VFX కు సంబంధించిన చాలా పనులు భారతదేశంలో పూర్తయ్యాయని నాగ్ అశ్విన్ వెల్లడించారు. తన తదుపరి ప్రాజెక్ట్‌కి సంబంధించిన అన్ని VFX వర్క్‌లు మొత్తం కూడా దేశంలోనే జరిగేలా చూస్తానని అన్నారు. అలాగే మన సినిమాలు విదేశాలకు వెళుతున్నాయి అని లోకల్ గా ఉండే టాలెంట్ ను ఎందుకు ఉపయోగించుకోకూడదనే ప్రశ్నలు లేవనెత్తారు.
ఏదేమైనప్పటికీ కూడా నాగ్ అశ్విన్ లోకల్ టాలెంట్ ను వీలైనంత అంతవరకు సపోర్ట్ చేసే విధంగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రాజెక్టు కే సినిమా గ్రాఫిక్స్ విషయంలో కొన్ని లోటుపాట్లు జరిగిన మాట వాస్తవమే అని కూడా ఒప్పుకున్నాడు. టీజర్ విడుదల చేసినప్పుడు ఆ రియాక్షన్ వచ్చిందని మళ్లీ పూర్తి సినిమా అవుట్ పుట్ విషయంలో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని కూడా అతను తెలియజేశాడు.