బుక్ మై షో.. కల్కి మరో సాలీడ్ రికార్డ్

ఇండియన్ మైథాలజీని సైన్స్ ఫిక్షన్ జోడించి చెప్పడంతో ఈ మూవీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది.

Update: 2024-07-04 12:03 GMT

కల్కి 2898ఏడీ మూవీ కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. అద్భుతమైన ప్రేక్షకాదరణతో వెయ్యి కోట్ల కలెక్షన్ దిశగా అడుగులు వేస్తోంది. బాహుబలి 2 తర్వాత కల్కి 2898ఏడీ రూపంలో మరో వెయ్యి కోట్ల కలెక్షన్స్ మూవీ ప్రభాస్ ఖాతాలో చేరాయడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. ఇండియన్ మైథాలజీని సైన్స్ ఫిక్షన్ జోడించి చెప్పడంతో ఈ మూవీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది.

ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాగ్ అశ్విన్ కల్కి మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. నాగ్ అశ్విన్ సృష్టించిన ఈ సినిమాటిక్ యూనివర్స్ ని చూడటానికి ప్రేక్షకులు ప్రత్యేక ఆసక్తి చూపించారు. అందుకే మూవీకి అన్ని భాషలలో అపూర్వ ఆదరణ లభిస్తోంది. వరల్డ్ వైడ్ గా ఏడురోజుల్లో 725 కోట్ల కలెక్షన్స్ ని కల్కి మూవీ సాధించింది. వీక్ డేస్ లో డీసెంట్ కలెక్షన్స్ తో సాధిస్తూ మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 13.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని ఈ చిత్రం అందుకుంది. గురువారం యూఎస్ ఇండిపెండెన్స్ డే కావడంతో పబ్లిక్ హాలిడే ఉంది. దీంతో కలెక్షన్స్ మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే మొదటి వారంలో బుక్ మై షో యాప్ ద్వారా అత్యధిక టికెట్ బుకింగ్స్ జరిగిన చిత్రంగా కల్కి 2898ఏడీ నిలిచింది. ఈ సినిమా 6.26 మిలియన్ టికెట్లు బుక్ మై షో ద్వారా సోల్డ్ అయ్యాయి.

దీని తర్వాత రెండో స్థానంలో షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ 5.80 మిలియన్ టికెట్స్ తో ఉంది. మూడో స్థానంలో రణబీర్ కపూర్ యానిమల్ సినిమా నిలిచింది. ఈ సినిమా వారం రోజుల్లో 5.20 మిలియన్ టికెట్స్ అమ్మకాలు జరిగాయి. నాలుగో స్థానంలో ఉన్న గద్దర్ 2 మూవీ 4.70 మిలియన్ టికెట్లు బుక్ మై షో ద్వారా సోల్డ్ అయ్యాయి. సలార్ మూవీ మొదటి వారం రోజుల్లో 3.92 మిలియన్ టికెట్స్ అమ్మకాలతో ఐదో స్థానంలో నిలిచింది.

అన్ని సినిమాలని కల్కి టికెట్స్ అమ్మకాల పరంగా దాటేసి టాప్ లో నిలిచింది. రెండో వారం కూడా కలెక్షన్స్ నిలకడగా కొనసాగితే ఈ ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేసే కలెక్షన్స్ వస్తాయని కచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ నుంచి 2024లో ఒక్క వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ కూడా పడలేదు. కల్కితో ఆ లోటు తీరిపోతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News

eac