కల్కి 4 వారాలు.. ఇలా కొనసాగింది!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీతో వరల్డ్ వైడ్ గా 1100 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నారు.

Update: 2024-07-26 05:37 GMT

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీతో వరల్డ్ వైడ్ గా 1100 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చి అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా కల్కి మూవీ నిలిచింది. నాగ్ అశ్విన్ సృష్టించిన యూనివర్స్ కి ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ గా సెట్ అయి ఆడియన్స్ ని ఎంగేజ్ చేశాయి. చిన్న చిన్న లోటుపాట్లు, అభ్యంతరాలు ఉన్నా కూడా అవి సినిమా ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా లేకపోవడం వల్ల ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు.

దీంతో వరల్డ్ వైడ్ గా కల్కి సినిమాకి అద్భుతమైన ఆదరణ లభించడంతో పాటు భారీ కలెక్షన్స్ వచ్చాయి. హిందీ మార్కెట్ లో కల్కి మూవీ 300 కోట్ల కలెక్షన్స్ కి దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ అమెరికాలో కూడా 19 మిలియన్ డాలర్స్ కి సమీపంలో కల్కి మూవీ కలెక్షన్స్ ఉన్నాయని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా నాలుగు వారాలు సాలిడ్ గా థియేటర్స్ లో రన్ అయ్యింది. మొదటివారం వరల్డ్ వైడ్ గా 660.70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే అందులో 343.92 కోట్ల షేర్ ఉంది.

రెండో వారంలో 223.30 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకోగా దాంట్లో 112.4 కోట్ల షేర్ ఉండటం విశేషం. మూడవ వారంలో కలెక్షన్స్ కొంతమేరకు తగ్గి 105.50 కోట్ల గ్రాస్ కి కల్కి వసూళ్లు పరిమితమయ్యాయి. 49.68 కోట్ల షేర్ వచ్చింది. నాలుగో వారంలో 37.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా అందులో 17.58 కోట్ల షేర్ ఉంది. ఓవరాల్ గా నాలుగు వారాల్లో కల్కి మూవీ 1100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకోక దాంట్లో 523.58 కోట్ల షేర్ దక్కింది.

ఈ కలెక్షన్స్ చూస్తుంటే ప్రభాస్ స్టామినా ఏంటనేది అర్థమవుతుంది. సరైన కథతో మూవీ పడితే మూడు వారాలపాటు ఆయనని ఎవరు ఆపలేరని కల్కి మూవీ కలెక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయి. సినిమాకి భారీగా ప్రమోషన్స్ చేయకుండానే, సోషల్ మీడియాలో పెద్దగా క్యాంపెయిన్ నిర్వహించకుండానే రికార్డ్ స్థాయిలో వసూళ్లు రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పొచ్చు.

సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ క్రెడిట్ డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ కి దక్కుతుంది. ఓవరాల్ కలెక్షన్స్ క్రెడిట్ మాత్రం కల్కి మూవీ కథ, ఆ కథని అద్భుతంగా ప్రేక్షకులకి రీచ్ అయ్యేలా నెరేట్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి ఇవ్వచ్చు. అలాగే ఈ కథని గ్రాండ్ గా ప్రేక్షకులకి కనెక్ట్ కావడానికి బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి స్టార్ క్యాస్టింగ్ కూడా స్ట్రాంగ్ రీజన్ అని చెప్పాలి.

Tags:    

Similar News