కల్కి 2898AD బాక్సాఫీస్.. గేమ్ షురూ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ దేశ వ్యాప్తంగా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-06-08 08:21 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ దేశ వ్యాప్తంగా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయిన కూడా మొదటి రోజు వందకోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేయగల సత్తా ప్రభాస్ సొంతం. సలార్ మూవీతో తన స్టామినా ఏంటనేది డార్లింగ్ అందరికి చూపించాడు. దేశంలో ఏ హీరోకి లేనంత క్రేజ్, మార్కెట్ ఇప్పుడు ప్రభాస్ కి ఉంది. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898ఏడీ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా 22 భాషలలో రిలీజ్ కి సిద్ధం అవుతోంది.

భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి 2898ఏడీ సిద్ధమవుతోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయాయి. వరల్డ్ మార్కెట్ కి కల్కి షేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ కారణంగా తెలుగుతో పాటు మిగిలిన భాషలలో కూడా సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది.

ఇప్పటికే ఓవర్సీస్ లో కల్కి 2898ఏడీ మూవీ బుకింగ్స్ కి చాలా థియేటర్స్ లో మొదలు పెట్టారంట. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన థియేటర్స్ మేగ్జిమమ్ మొదటి రోజు షోలకి సంబంధించి హౌస్ ఫుల్ గా టికెట్స్ బుక్ అయినట్లు తెలుస్తోంది. 20 రోజుల ముందుగానే కల్కి 2898ఏడీ సినిమా టికెట్స్ భారీ స్థాయిలో బుక్ అవుతున్నాయంటే ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు.

అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటి వరకు 1.2 కోట్ల గ్రాస్ ఓవర్సీస్ లో కలెక్ట్ అయ్యిందంట. ఇది ఒక రికార్డ్ అనే మాట వినిపిస్తోంది. ఈ నెల 10న మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు. సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించింది, అలాగే దిశా పటాని కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతోంది.

బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమితాబచ్చన్, యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని ఈ చిత్ర కథని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. విజువల్ వండర్ గా సరికొత్త ప్రపంచాన్ని మూవీలో చూడబోతున్నామని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. మూవీని ఈ 20 రోజులు ఎంత స్ట్రాంగ్ గా పబ్లిక్ లోకి తీసుకొని వెళ్తారనే దానిపై సినిమాపై ఫస్ట్ డే కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Tags:    

Similar News