కల్కి ప్రమోషన్స్.. క్యా ప్లాన్ హై!

ఇప్పటికే ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Update: 2024-05-30 02:30 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ కల్కి 2898 ఏడీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా? డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన కల్కి ప్రపంచాన్ని చూద్దామా? అని తహతహలాడుతున్నారు. హాలీవుడ్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవల సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్లతో మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా ప్రభాస్ బుజ్జి వెహికల్ ను రివీల్ చేశారు. ఆ బుజ్జి కోసమే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనె, కమల్ హాసన్ వంటి ఎందరో ప్రముఖులు నటిస్తున్న ఈ మూవీ మరో 28 రోజుల్లో రిలీజ్ కానుంది.

దీంతో మేకర్స్ ప్రమోషన్స్ కోసం పక్కా ప్లాన్ గీశారు. అందుకు తగ్గట్లు ముందుకు వెళుతున్నారు. బుజ్జి అండ్‌ భైరవ పేరుతో రూపొందించిన ప్రీ లూడ్ వీడియోను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో మే 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. చిన్నారులకు వినోదం పంచే ఉద్దేశంతో వీడియో రెడీ చేసినట్లు తెలుస్తోంది. కల్కి ప్రపంచం కోసం కూడా వీడియోలో ఉన్నట్లు సమాచారం.

జూన్ లో కల్కి మూవీలోని రెండు పాటలను మేకర్స్ రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆ తర్వాత జూన్ ఫస్ట్ వీక్ లోనే థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అందులో మూవీలో ప్రముఖ పాత్రలు పోషించిన ప్రభాస్, అమితాబ్, దీపిక సహా పలువురి యాక్టర్ల పవర్ ఫుల్ యాక్షన్ ను చూపించనున్నారు. అలా సినిమాలోని పాత్రలన్నీ పరిచయం చేయనున్నారు మేకర్స్.

ఇక జూన్ మూడో వారంలో కల్కి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహించనున్నారు మేకర్స్. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులు అంతా అటెండ్ అవ్వనున్నారు. అంతే కాకుండా.. రిలీజ్ కు కొద్ది రోజుల ముందు ప్రభాస్, దీపికా పదుకొనె వరుస ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు.

నార్త్ లో కూడా జోరుగా ప్రమోషన్లు చేయనున్నారు. దీని బట్టి చూస్తే.. రూ.600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పక్కా ప్లాన్ తో సినీ ప్రియుల దృష్టి మొత్తాన్ని తమ మూవీ వైపు తిప్పుకోవడానికి చూస్తున్నారు మేకర్స్. జూన్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న కల్కి సినిమా.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News