కల్కీ అసలైన సినిమా జూన్ 4 తర్వాత!
రిలీజ్ సమయం దగ్గరపడుతోన్న `కల్కి 2898` ప్రమోషన్ ఎక్కడ అంటూ అభిమానులు హైరానా పడుతోన్న సంగతి తెలిసిందే.
రిలీజ్ సమయం దగ్గరపడుతోన్న `కల్కి 2898` ప్రమోషన్ ఎక్కడ అంటూ అభిమానులు హైరానా పడుతోన్న సంగతి తెలిసిందే. మెట్రోపాలిటన్ సిటీల్లో టీమ్ ఎక్కడా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో ప్రచారం లేదు? ఏంటి ఈ సైలెన్స్ అంటూ ఆందోళన చెందుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక్కో ఈవెంట్ తో సర్ ప్రైజ్ చేయడం మొదలు పెట్టారు. మొన్నటి రోజున ఆర్ ఎఫ్ సీలో బుజ్జి కారు కోసం ప్రత్యేకంగా ఓ ఈవెంట్ నే నిర్వహించారు.
అందులో బుజ్జి ప్రత్యేకత గురించి ఎంతో గొప్పగా చెప్పారు. సినిమాలో బుజ్జి పాత్ర ఎలా ఉంటుందో చెప్పేసారు. ఇది ఎంతో గ్రాండ్ సక్సెస్ అయింది. కల్కీని ఈ ఒక్క ఈవెంట్ పాన్ ఇండియాలోకి తీసుకెళ్లిపోయింది. ఇంకా బుజ్జితో రిలీజ్ అయ్యేలోపు పలు ఈవెంట్లలో హంగామా తప్పనిసరి. అటుపై సినిమాకి సంబంధించిన యానిమేషన్ వీడియోలతో మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. అలాగే సినిమాకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేసారు.
ఇలా ఒకదాని వెంట ఒకటి ఆర్డర్ ప్రకారం రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. నాగ్ అశ్విన్ ప్రచారంలో ఆచరణలోకి తెచ్చిన కొత్త స్ట్రాటజీ ఇది. జూన్ 27న సినిమా రిలీజ్ కాబట్టి ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత ప్రచారం జోరు పీక్స్ కు చేరుతుందని చెప్పొచ్చు. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలవుతాయి. ఎవరు గెలిచినా ప్రమాణ స్వీకారం ఆ తర్వాతే ఉంటుంది. ఆ రోజు మినహా మిగిలి అన్ని రోజులు `కల్కీ`వే. ఈ సినిమాకి పోటీగా మరో సినిమా కూడా లేదు.
కాబట్టి కొన్ని రోజుల పాటు మార్కెట్ లో కల్కి హడావుడే కనిపిస్తుంది. చెన్నై..బెంగుళూరు...ముంబై లాంటి సిటీల్లో ప్రత్యేక ఈవెంట్లు నిర్వహిస్తారు. వాటిలో ప్రభాస్ తో పాటు సినిమాలో నటించిన కీలక నటులంతా పాల్గొంటారు. ఆయ పరిశ్రమలకు చెందిన హీరోల్ని ప్రమోషన్ సందర్భంగా తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. చివరిగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రచారం పూర్తవుతుంది. ఆ తర్వాత సినిమా రిలీజ్ కౌంట్ డౌన్ మొదలవుతుంది.