కల్కి రిలీజ్ ట్విస్ట్.. ట్రైలర్ వచ్చేది అప్పుడే

సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్ల్, గ్లింప్స్ ఇప్పటికే ఊహించని స్థాయిలో అంచనాలు పెంచేశాయి.

Update: 2023-12-29 11:57 GMT

పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులంతా సలార్ సక్సెస్ ను మస్త్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మూడు ఫ్లాపుల తర్వాత ప్రభాస్ హిట్ కొట్టడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాలను ఇప్పుడు డబుల్ చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రభాస్ తో ఆయన తెరకెక్కిస్తున్న కల్కి 2898 ఏడీకి సంబంధించి క్రేజ్ అప్డేట్స్ ఇచ్చారు.

సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్ల్, గ్లింప్స్ ఇప్పటికే ఊహించని స్థాయిలో అంచనాలు పెంచేశాయి. తాజాగా కల్కి మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు నాగ్ అశ్విన్. IIT బాంబే టెక్ ఫెస్ట్ 23లో పాల్గొన్న ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేశారు.

కల్కి మూవీ ట్రైలర్ ను మరో 93 రోజుల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు నాగ్ అశ్విన్. ఆ ప్రకారం చూస్తే ఏప్రిల్ తొలి వారంలో ఈ సినిమా ట్రెలర్ విడుదల అవ్వనుందన్నమాట. ఈ మూవీని ఎప్పుడు విడుదల చేయాలనుకుంటున్నది త్వరలోనే చెబుతామని, అయితే కచ్చితమైన తేదీ గురించి ఇప్పట్లో స్పష్టత లేదని అన్నారు. కల్కికి సీక్వెల్ ఉందో లేదో రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు చెప్పానని అన్నారు నాగ్ అశ్విన్.

ఈ మూవీ కోసం మహానటి కన్నా ముందు నుంచే ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు తెలిపారు. కల్కి ఓ స్టాండ్ అలోన్ ఫిల్మ్ అని, స్టోరీకి తగ్గట్లు పేరు పెట్టినట్లు నాగ్ అశ్విన్ చెప్పారు. మైథాలిజీతో టెక్నాలజీని మిక్స్ చేసి ఆసక్తికరంగా చిత్రీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం కల్క్ యూనివర్స్ లేదా నాగీ యూనివర్స్ లో ఎలాంటి భాగం కాదని స్పష్టం చేశారు. హాలీవుడ్ ఫిల్మ్ టామ్ క్రూజ్ లో లాంటి ఫైట్ సీన్స్ ఉండవని తెలిపారు. సినిమాలో వీఎఫ్ ఎక్స్ కోసం చాలా కష్టపడుతున్నట్లు వెల్లడించారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు రూ.600 కోట్ల బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపికా పదుకొణె, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News