కల్కి : రెండో వారం కూడా క్లీన్‌ స్వీప్‌...!

గత కొన్ని సంవత్సరాలుగా ఎంత పెద్ద సినిమా అయినా మొదటి వారం రోజులు మాత్రమే థియేటర్లలో సందడి చేస్తోంది.

Update: 2024-07-04 04:34 GMT

ప్రభాస్‌ కి ఉన్న పాన్‌ ఇండియా క్రేజ్ ని ఉపయోగించుకుని విభిన్న చిత్రాల దర్శకుడు నాగ్ అశ్విన్‌ రూపొందించిన కల్కి సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏ స్థాయిలో వసూళ్లను రాబడుతుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే వెయ్యి కోట్ల మార్క్ కి చేరువ అయిన కల్కి సినిమా రేపటి నుంచి తగ్గే అవకాశం ఉందని కొందరు భావించారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఎంత పెద్ద సినిమా అయినా మొదటి వారం రోజులు మాత్రమే థియేటర్లలో సందడి చేస్తోంది. ఆ తర్వాత ఇతర సినిమాల రాకతో కాస్త చల్లారడం, ఒక మోస్తరు వసూళ్లు రావడం వంటివి చూస్తున్నాం. కానీ రెండో వారంలో కూడా కల్కి కి పోటీ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

కల్కి ఓటీటీ ఇప్పట్లో లేదు అంటూ యూనిట్‌ సభ్యులు పదే పదే చెబుతున్న నేపథ్యంలో ముందో వెనకో... కాస్త ఆలస్యంగానో థియేటర్లలోనే కల్కి ని చూడాలని ఫ్యాన్స్ మరియు సినీ ప్రేమికులు నిర్ణయించుకున్నారు. అందుకే రాబోయే రెండు వారాల పాటు కల్కి బాక్సాఫీస్ సందడి కంటిన్యూ అవ్వడం ఖాయం.

మొదటి వారంతో పోల్చితే వసూళ్లు కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ మరీ దారుణంగా డ్రాప్ అవ్వడం మాత్రం జరగదని, కల్కి రెండో వారంలో రికార్డ్‌ స్థాయి షేర్ ను దక్కించుకోవడం ద్వారా సరికొత్త రికార్డ్‌ లను నెలకొల్పడం ఖాయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు ముందస్తు ఊహాగానాలు చేస్తున్నారు.

Read more!

కల్కి కి పోటీగా థియేట్రికల్‌ రిలీజ్ మూవీస్ పెద్దగా ఏమీ లేవు. కానీ ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బూతు సిరీస్ మీర్జాపూర్‌ సీజన్‌ 3 మాత్రం జులై 5న స్ట్రీమింగ్‌ కు రెడీ అయ్యింది. ఈ బూతు సిరీస్‌ కి ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మీర్జాపూర్ వల్ల ఏమైనా కల్కి కి ఎఫెక్ట్‌ పడుతుందా అంటే లేదు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే, మరి కొందరు మాత్రం వీకెండ్‌ లో ఇంట్లో కూర్చుని మీర్జాపూర్‌ చేసే వారు ఎక్కువ మందే ఉంటారు. కనుక కల్కి కి కాస్త ఎఫెక్ట్‌ తప్పదేమో అంటున్నారు. మొత్తానికి కల్కి రికార్డ్‌ స్థాయి వసూళ్లకు వచ్చిన ఢోకా అయితే ఏమీ లేదు.

Tags:    

Similar News

eac