రాజ్ తరుణ్ పై సెక్షన్ 493… చట్టం ఏం చెబుతుందంటే?

సెక్షన్ 493 ప్రకారం కేసు ఎందుకు పెట్టారని అడిగేవారికి కళ్యాణ్ దిలీప్ సుంకర సమాధానం చెప్పారు.

Update: 2024-07-14 13:32 GMT

హీరో రాజ్ తరుణ్ పై అతని మాజీ ప్రియురాలు లావణ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర ద్వారా చట్టపరంగా పలు సెక్షన్స్ లో రాజ్ తరుణ్ పై కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. లావణ్య లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర ద్వారా లీగల్ గా రాజ్ తరుణ్ పై ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యింది. అయితే రాజ్ తరుణ్ పై పెట్టిన కేసులో సెక్షన్ 493 వర్తించదని ఒక లాయర్ ఆమె ని కన్ఫ్యూజ్ చేయడంతో ఆత్మహత్య ప్రయత్నం చేసిందని కళ్యాణ్ దిలీప్ సుంకర మీడియాకి తెలిపారు.

సెక్షన్ 493 ప్రకారం కేసు ఎందుకు పెట్టారని అడిగేవారికి కళ్యాణ్ దిలీప్ సుంకర సమాధానం చెప్పారు. ఆమె మానసిక స్థితిని కొంతమంది స్వార్ధబుద్ధితో దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని, పలు యుట్యూబ్ ఛానల్స్ కి వెళ్లి ఈ కేసు నిలబడదనే విధంగా ప్రచారం చేస్తున్నారని కళ్యాణ్ దిలీప్ సుంకర విమర్శించారు. అబద్ధపు హామీతో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకోకుండా తాళి కట్టినాట్లు నమ్మించి ఆమెని మోసం చేసి పలుమార్పు శారీరకంగా వాడుకుంటే అలాంటి వారిపై సెక్షన్ 493 ప్రకారం కేసు నమోదు చేయొచ్చని అన్నారు.

ఈ సెక్షన్ లో కేసు బలంగా నిలబడటానికి కావాల్సిన సాక్ష్యాధారాలు పోలీసులకి ఇప్పటికే సమర్పించడం జరిగిందని కళ్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు. అయితే ఆ లాయర్ మాత్రం లావణ్యకి ఫోన్ చేసి బెదిరించడమే కాకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మీకు అంత ఇంటరెస్ట్ ఉంటే రాజ్ తరుణ్ తరపున కేసు టేకప్ చేసి హైకోర్టులో వాదోపవాదాలకి సిద్ధం కావాలని సవాల్ చేశారు. లావణ్య కేసుని నాకు నేనుగా టేకప్ చేయలేదని కళ్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు.

లావణ్య, ఆమె కుటుంబం నన్ను సంప్రదించిన తర్వాత అన్ని పరిశీలించి అన్యాయం జరిగిందని నిర్ధారించుకొని కేసుని టేకప్ చేశానని, డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి సాక్ష్యాలతో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే ఆమె మానసిక ఆందోళనతో ఉండటంతో నా జూనియర్ లాయర్ లని కూడా ఆమెకి తోడుగా ఉంచడం జరిగిందని కళ్యాణ్ దిలీప్ సుంకర తెలియజేశారు. లావణ్యకి చట్టపరంగా న్యాయం చేయడంతో పాటు రాజ్ తరుణ్ తప్పు చేసాడని ఆధారాలతో ప్రూవ్ చేస్తానని కళ్యాణ్ దిలీప్ మీడియాకి వివరించారు.

లావణ్య కూడా రాజ్ తరుణ్ విషయంలో చాలా సీరియస్ గా ఫైట్ చేయడానికి డిసైడ్ అయినట్లు అర్ధమవుతోంది. లావణ్యకి జరిగిన అన్యాయం భవిష్యత్తులో సహజీవనం చేసే ఏ ఆడపిల్లకి జరగకూడదని న్యాయపోరాటం చేస్తున్నట్లు కళ్యాణ్ దిలీప్ సుంకర తెలియజేశారు. మరి ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News