ఉత్తమ నటుడు కమల్..ఉత్తమ నటి కీర్తిసురేష్!
ఒసాకా తమిళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్ విజేతలను కమిటీ ప్రకటించింది.
ఒసాకా తమిళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్ విజేతలను కమిటీ ప్రకటించింది. ఉత్తమ నటుడిగా విశ్వనటులు కమల్ హాసన్..ఉత్తమ నటిగా అందాల తార కీర్తి సురేష్ నిలిచారు. 2022 చిత్రాలకు గాను ఈ అవార్డుల ప్రకటన జరిగింది. `విక్రమ్` లో కమల హాసన్ నటనకు.. `సాని కాయితం` అనే సినిమాలో కీర్తినటనకు ఈ గుర్తింపు దక్కింది. ఉత్తమ దర్శకుడిగా మణిరత్నం నిలిచారు. పొన్నియన్ సెల్వన్ చిత్రానికి గానూ ఈ అవార్డు వచ్చింది.
అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుద్ ( విక్రమ్) నిలిచాడు. అత్యధికంగా 8 విభాగాల్లో `విక్రమ్` కు, `పొన్నియ్ సెల్వన్` కి ఏడు విభాగాల్లో అవార్డులు వరించాయి. బెస్ట్ ఎంటర్ టైనర్ గా `లవ్ టుడే` నిలిచింది. జపాన్ దేశంలో ఒసాకా నగరంలో ఈ వేడుక జరిగింది. ఇది కోలీవుడ్-జపాన్ చిత్ర పరిశ్రమల మధ్య వారధిగా నిలుస్తోంది. మరికొంత మంది విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఫోటో గ్రఫీ: రవివర్మన్( పొన్నియన్ సెల్వన్), బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్స్: రత్నకుమార్, లోకేష్ కనగరాజ్ (విక్రమ్), బెస్ట్ కొరియోగ్రఫీ: జానీ మాస్టర్ (అరబిక్ కుతు పాట బీస్ట్ నుంచి), బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: ఐశ్వర్యా రాయ్( పొన్నియన్ సెల్వన్), బెస్ట్ విలన్: విజయ్ సేతుపతి( విక్రమ్) నిలిచారు. ఇప్పటికే ఉత్తమ విలన్..విక్రమ్ సినిమాలకు వివిధ అవార్డులు...రివార్డులు సొంతం చేసుకుంది. తాజాగా ఒసాకా వేదికపైనా ఈ రెండు సినిమాలు మెరవడంతో తమిళ పరిశ్రమకి మరింత గుర్తింపు గా మారింది.
ఉత్తమ నటుడిగా కమల్ హాసన్ ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్నారు. దేశ-విదేశాల్లో కమల్ కి ఎన్నో పురస్కారాలు వరించాయి. అలాగే ఉత్తమ నటిగా కీర్తి సురేష్ `మహానటి` చిత్రానుకు గాను పలు అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఉత్తమ నటి అవార్డు అమ్మడికి మరో బూస్టింగ్ లాంటిదని చెప్పొచ్చు.