కమల్ విక్రమ్ వర్సెస్ రజిని జైలర్..!
కమల్ కి విక్రమ్ లానే రజినికి జైలర్ అని కోలీవుడ్ ఫ్యాన్స్ చెప్పుకోవడంలో తప్పేమి లేదు.
కమల్ హాసన్ విక్రమ్ సినిమా లాస్ట్ ఇయర్ వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటి మాత్రమే కాదు కోలీవుడ్ లో వచ్చిన క్లాసిక్ సినిమాల్లో కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లోకేష్ కనగరాజ్ బ్రిలియంట్ డైరెక్షన్ ఏంటి అన్నది విక్రమ్ తో చూపించాడు. అంతకుముందు ఖైదీ, మాస్టర్ సినిమాలు చేసిన లోకేష్ కమల్ తో విక్రమ్ ని చాలా పద్ధతిగా తెరకెక్కించాడు. తమిళ సినిమా అనే కాదు సినిమాను ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడు కూడా విక్రమ్ సినిమాను తన సూపర్ హిట్ సినిమాల లిస్ట్ లో చేర్చారు. అలా విక్రమ్ తో తన మార్క్ సెట్ చేసుకున్నాడు లోకేష్.
ఇక ఆ సినిమా కలెక్ట్ చేసిన వసూళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. కమల్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా.. సరైన హిట్ పడితే కమల్ హాసన్ బాక్సాఫీస్ రేంజ్ ఏంటన్నది విక్రమ్ చూపించింది. అయితే లేటెస్ట్ గా వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ కూడా వసూళ్లతో అదరగొట్టేస్తుంది. రజినికి కూడా జైలర్ ఒక సూపర్ కమ్ బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అయితే కమర్షియల్ గా విక్రమ్ కలెక్షన్స్ ని జైలర్ దాటేసిందని తెలుస్తున్నా విక్రమ్ తో పోలిస్తే జైలర్ చాలా వెనుక ఉంటుందని చెప్పొచ్చు.
జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా తన మార్క్ డైరెక్షన్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగా సినిమా చేశాడు. అయితే జైలర్ సినిమా రొటీన్ రెగ్యులర్ కథ.. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేదు. రజినికి ఉన్న ఫ్యాన్ బేస్ మీద సినిమా ఇలా కలెక్షన్స్ రాబడుతుంది కానీ విక్రం తో పోల్చేంత సబ్జెక్ట్ కానీ ఆ సినిమా సరసన నిలిచే కంటెంట్ కానీ జైలర్ లో లేదని స్పష్టంగా తెలుస్తుంది. విక్రమ్ అలా కాదు.. కమల్ పర్ఫార్మెన్స్, లోకేష్ డిటైల్డ్ నెస్, అనిరుద్ మ్యూజిక్ ఇలా ప్రతి యాస్పెక్ట్ లో విక్రమ్ నెక్స్ట్ లెవెల్ అనిపించుకుంది. కలెక్షన్స్ వైజ్ విక్రమ్ ని జైలర్ దాటేసినా ప్రేక్షకులు మాత్రం విక్రం రేంజ్ వేరే అంటున్నారు.
కమల్ కి విక్రమ్ లానే రజినికి జైలర్ అని కోలీవుడ్ ఫ్యాన్స్ చెప్పుకోవడంలో తప్పేమి లేదు. కానీ జైలర్ వర్సెస్ విక్రమ్ అని అంటే మాత్రం కచ్చితంగా అందులో విక్రమ్ మాత్రమే విన్నర్ అని చెప్పొచ్చు. ఈ కలెక్షన్స్ లెక్కల కన్నా ప్రేక్షకుడు ఎంజాయ్ చేసిన దాన్ని కొలవడం జరిగితే జైలర్ కి యావరేజ్ మార్కులు వస్తే విక్రం కి 100కి 100 వస్తాయి. సో విక్రమ్, జైలర్ రెండు సూపర్ హిట్ అయినందుకు ఫ్యాన్స్ సంతోషపడటంలో తప్పులేదు కానీ ఆ రెండు సినిమాల్లో ఏది హిట్టు ఏది బ్లాక్ బస్టర్ అని కాలిక్యులేషన్ చేయడం అంత టైం వేస్ట్ పని మరోటి లేదని చెప్పొచ్చు.