శంకర్ లెక్క తేలింది… ఇప్పుడు మణిరత్నం లెక్క
అన్నింటిని దాటుకొని జులై 12న థియేటర్స్ లోకి వచ్చింది.
యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ 28 ఏళ్ళ క్రితం స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఇండియన్ మూవీ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తరువాత శంకర్, కమల్ హాసన్ మళ్ళీ కలిసి పనిచేయలేదు. అయితే 2017లో ఇండియన్ 2 మూవీని శంకర్ ఎనౌన్స్ చేశారు. తరువాత గ్రాండ్ గా లాంచ్ అయిన మధ్యలో చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. అన్నింటిని దాటుకొని జులై 12న థియేటర్స్ లోకి వచ్చింది.
ఈ మూవీ కమల్ హాసన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ అనేసరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇండియన్ 2 మూవీ ఆ అంచనాలని అందుకోలేకపోయింది. కథాంశం పరంగా ఈ సినిమా ప్రేక్షకులని బోర్ కొట్టించింది. పెట్టిన పెట్టుబడిలో కనీసం 40% శాతం కూడా రికవరీ వచ్చేలా కనిపించడం లేదు. ఇండియన్ మూవీకి ఆడియన్స్ ఎంత బాగా కనెక్ట్ అయ్యారో అంతకు మించి ఇండియన్ 2కి రిజక్ట్ చేశారు.
శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ మూవీ ఇండియన్ 2 మూవీ అయితే ఆల్ మోస్ట్ అవుట్ అయిపోయినట్లే. ఇప్పుడు కోలీవుడ్ ప్రేక్షకుల దృష్టి మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ లో రెడీ అవుతోన్న థగ్ లైఫ్ మూవీపైన పడింది. 38 ఏళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. చివరిగా కమల్ హాసన్, శంకర్ 1987లో నాయకన్ మూవీ కోసం కలిసి పనిచేశారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.
కమల్ హాసన్ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లో నాయకన్ కూడా ఒకటి. ఈ సినిమా స్ఫూర్తితో తరువాత చాలా మంది దర్శకులు మూవీస్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. మరల మూడు దశాబ్దాల తర్వాత థగ్ లైఫ్ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాకి కథని కమల్ హాసన్ అందించడం విశేషం. మణిరత్నం చివరిగా పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. అయితే థగ్ లైఫ్ తో పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నారు. మణిరత్నం బ్రాండ్ తో వస్తోన్న సినిమా కాబట్టి కొంత హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఈ లెజెండరీ కాంబినేషన్ కి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం వస్తుందనేది వేచి చూడాలి. ఈ ఏడాది డిసెంబర్ లో థగ్ లైఫ్ సినిమాని థియేటర్స్ లోకి తీసుకొని రాబోతున్నారు.