రజనీతో కమల్ స్నేహం పుల్ స్టాప్ పడినట్లే!
సూపర్ స్టార్ రజనీకాంత్-విశ్వనటుడు కమల్ హాసన్ స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలు చేసారు
సూపర్ స్టార్ రజనీకాంత్-విశ్వనటుడు కమల్ హాసన్ స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలు చేసారు. ఇరువురి గురువు కూడా ఒక్కరే. ఆయన బాలచందర్. శిష్యులిద్దర్నీ సూపర్ స్టార్ గా మార్చడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైనది. అయితే ఈ స్నేహితులిద్దరు చాలా కాలంగా కలిసి సినిమాలు చేయడం లేదు. ఎవరికి వారు సినిమాలు చేయడం తప్ప! ఒకే ప్రేమ్ లో కనిపించడం లేదు.
దీంతో రకరకాల సందేహాలు ఎన్నోసార్లు తెరపైకి వచ్చాయి. ఇద్దరి మధ్య మునుపటంత బలమైన స్నేహం లేదని, వివాదాలున్నాయి, స్టార్ డమ్ విషయంలో పొరపొచ్చాలొచ్చినట్లు వార్తలొచ్చాయి. అయితే వాటిని ఇరువురు ఖండించాన సందర్భాలెన్నో. ఇటీవలే కమల్ హాసన్ `కల్కి 2898` లో అమితాబచ్చన్, ప్రభాస్ తో కలిసి నటించారు. చాలా కాలం తర్వాత కమల్ ఇద్దరు స్టార్ హీరోలతో పనిచేయడం ఇదే తొలిసారి.
ఇటీవల రిలీజ్ అయిన సినిమా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తో కమల్ ఎందుకు మళ్లీ సినిమాలు చేయడం లేదు? అన్న చర్చ తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కమల్ హాసన్ రజనీకాంత్ తో స్నేహం గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. `మా స్నేహం ఎన్నో ఏళ్లగా కొనసాగుతుంది. గతంలో కలిసి ఎన్నో సినిమాలు చేసాం. కానీ ఒకదశలో కలిసి సినిమాలు చేయకూడదని కూడా నిర్ణయం కలిసే తీసుకున్నాం.
మా ఇద్దరి మధ్య పోటీ తత్వం ఉంది. కానీ అసూయలేదు. ఇద్దరం రెండు వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నామంతే. అయినా ఒకరి గురించి ఒకరు ఎప్పుడు చులకనగా మాట్లాడుకోలేదు. ఇప్పుడు సీనియర్లం కాబట్టి ఇలా ఉంటున్నాం అనుకోవద్దు. 20 ఏళ్ల నుంచి ఇలాగే ఉంటున్నాం. కానీ మీకు ఇవేవి తెలియక ఏవోవో ఉన్నాయని ఊహించుకుంటున్నారు. ఇక్కడ అలాంటి ఊహకకు దారి లేదు. మేం ఇప్పుడే కాదు..ఎప్పటికీ స్నేహితులమే` అని అన్నారు.