కంగన సంచలన నిర్ణయం..దేశం విడిచి పోయేలా!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన సంగతి తెలిసిందే. తనని తానే స్టార్ గా తీర్చిదిద్దుకుని పరిశ్రమలో ఎదిగింది. ఓవైపు పరిశ్రమ నుంచి స్టార్ కిడ్స్ పోటీ..మరోవైపు బయట భామల నుంచి పోటీ ని ఎదుర్కుంటూ ఎన్నో సవాళ్ల మధ్య స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నేడు తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని స్టార్ హీరోలకే సవాల్ విసురుతుంది.
అలాంటి నటి కెరీర్ ఆరంభంలో ఎదురైన కొన్ని ఇబ్బందులు గురించి తాజాగా రివీల్ చేసింది. ` నటిని కావాలని 2004లో ఇండస్ట్రీకి వచ్చా. 2005-06 లో `గ్యాంగ్ స్టర్`, `వోహ లమ్హే` వంటి చిత్రాల్లో నటించా. మాదక ద్రవాలకు అలవాటు పడిన సూపర్ మోడల్, గ్యాంగ్ స్టర్ లాంటి ఎన్నో పాత్రలు పోషించా. మంచి ప్రశసంలు వచ్చాయి. అయితే దాదాపు దశాబ్ధం పాటు నాకు ఇండస్ట్రీలో పని దొరకలేదు.
అవకాశాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కున్నా. దేశమే నన్ను బహిష్కరించింది. దీంతో విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నా. దర్శకురాలిగా కంటే నటిగానే ఈజీగా ఉంది. కానీ నటిగానే కొనసాగడం నచ్చదు. అందుకు కొన్ని కారణాలున్నాయి. సెట్కి సంబంధించి పూర్తి సమాచారం మన వద్ద ఉండదు. దర్శ కురాలిగా ఉండటం నాకెంతో ఇష్టం. సెట్ లో ఏం జరుగుతుంది? అని అడిగితే తప్పకుండా నేను చెప్పగలను.
నాకు పూర్తి అవగాహన ఉంటుంది. సెట్స్ లో నటీనటులంటే ఎంతో గౌరవంగా చూస్తా. నేను పడిన ఇబ్బందలు వాళ్లు పడకూడదని తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా` అని అంది. కంగన నటించిన `ఎమర్జెన్సీ` వచ్చే నెల 6న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా అమ్మడు అన్నీ మీడియా హౌస్ లు చుట్టేస్తోంది. ప్రస్తుతం మండి నియోజక వర్గం నుంచి ఎంపీగానూ కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎదురయ్యే ప్రశ్నలకు ధీటైన సమాధానాలు ఇస్తోంది.