ఆ ఒక్క హీరోని కంగన పొగిడేయడం వెనక లాజిక్?
కంగనా రనౌత్ తాజా ట్వీట్ లో ''జాన్‌ను నిజమైన స్ఫూర్తిదాయకమైన హీరో" అని అభివర్ణించింది.
కొన్నిటికి లాజిక్కులు వెతక్కూడదు. నచ్చని వారిని తిట్టేయడం నచ్చినవారిని పొగిడేయడం కంగనకు ఉన్న అలవాటు. ఇప్పుడు ఉన్నట్టుండి కండల హీరో జాన్ అబ్రహాంని ఆకాశానికెత్తేసింది వివాదాల క్వీన్. ఎన్నడూ లేనిది ఇంతలోనే ఈ మార్పు ఏమిటో అర్థంగాక జనం బుర్రలు పట్టుకున్నారు.
కంగనా రనౌత్ తాజా ట్వీట్ లో ''జాన్‌ను నిజమైన స్ఫూర్తిదాయకమైన హీరో'' అని అభివర్ణించింది. తాను జాన్ ఒక కుటుంబంలా ఉంటామని.. ఒకరికొకరు సహకరించుకుంటామని కంగన తెలిపింది.
పరిశ్రమలోని ఇతరుల నుండి తమను తాము వేరుగా ఉంచుకోవడమెలానో తెలిసినవాళ్లమని కూడా అంది. జాన్ PETA ఇండియా ప్రచారానికి సంబంధించిన ఫోటోను షేర్ చేసి జాన్ ని పొగిడేసింది కంగన. ''నేను చిత్ర పరిశ్రమలోని ప్రతికూల వ్యక్తుల గురించి చాలా చెప్పాను.
కానీ పూర్తిగా నిజమైన స్ఫూర్తిదాయకమైన వారిని కూడా నేను ఎప్పటికీ మరచిపోకూడదు. నేను జాన్‌తో కలిసి పనిచేశాను. అతను ఎంత అద్భుతమైన వ్యక్తినో చెప్పడానికి నాకు తగినన్ని పదాలు లేవు. చాలా మందికి ఇది తెలియకపోవచ్చు, ఎందుకంటే అతను తనను ప్రశంసిస్తూ భజన చేసే మీడియాకు డబ్బు చెల్లించడు'' అని అంది. ''అతడు దయగలవాడు.. క్రమశిక్షణ కలిగినవాడు. వివాహం లేదా సంబంధాలకు PR లేదు. మహిళలను వేధించడం లేదా ప్రయోజనం పొందడం లేదు. ఎజెండా లేదా గ్రూపిజం లేదు. కేవలం అద్భుతమైన మనిషి. నిన్ను ప్రేమిస్తున్నాను జాన్'' అని కంగన వ్యాఖ్యానించింది.
జాన్ ''స్వీయ-నిర్మిత వ్యక్తి'' అని పొగిడేయడమే గాక... అతడి జీవితంలోని ప్రతి అంశంలోనూ విజయం సాధించాడని కంగన వెల్లడించింది. పరిశ్రమ ప్రముఖులకు గృహ సిబ్బందిని అందించే ఏజెంట్ ఓసారి కంగనా మేనేజర్‌తో మాట్లాడుతూ.. పరిశ్రమలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే తమ సిబ్బందిని దయతో ప్రేమతో చూసుకుంటారు.
ఆ ఇద్దరూ జాన్ అబ్రహం- కంగనా రనౌత్ అని అతడు చెప్పాడట. అయితే కంగన ఉన్నట్టుండి ఎందుకిలా జాన్ ని పొగిడేస్తోంది? అంటూ కొత్త డౌట్ పుట్టుకొస్తోంది. హఠాత్తుగా జాన్ అబ్రహం గురించి ఎందుకు పోస్ట్ చేసిందో అని నెటిజన్లు పెద్ద షాక్‌కు గురవుతున్నారు. కంగనతో తిట్లు తిన్న హీరోల జాబితాలో హృతిక్ రోషన్- రణవీర్ సింగ్- రణబీర్ కపూర్ లాంటి అగ్ర హీరోలు ఉన్నారు. కానీ జాన్ అబ్రహాంకి మాత్రమే ఊహించని పొగడ్తలు దక్కాయి.