కంగన MP నో డౌట్.. భాజపా బిగ్ స్కెచ్!
ఇన్నాళ్లు బాలీవుడ్ శత్రువర్గంపై తనదైన శైలిలో విరుచుకుపడిన కంగన, ఇకపై రాజకీయ శత్రువులపైనా విరుచుకుపడాల్సిన సన్నివేశం వచ్చేసింది
ఇన్నాళ్లు బాలీవుడ్ శత్రువర్గంపై తనదైన శైలిలో విరుచుకుపడిన కంగన, ఇకపై రాజకీయ శత్రువులపైనా విరుచుకుపడాల్సిన సన్నివేశం వచ్చేసింది. ఎట్టకేలకు కంగనకు ఎంఎల్ఏ అయ్యే యోగం కనిపిస్తోంది.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఐదవ జాబితాను విడుదల చేయగా, ఈ జాబితాలో కంగన పేరు ఉంది. 111 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి (ప్రకృతి అందాల హిమానీ నగరం) నియోజకవర్గం నుండి నటి కంగనా రనౌత్ భాజపా ఎం.ఎల్.ఏ అభ్యర్థిగా పోటీకి దిగుతోంది. ఇదే జాబితాలో మీరట్ నుండి అరుణ్ గోవిల్ ఉన్నారు.
తనను తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిమాని అని పదే పదే చెప్పుకునే కంగనా రనౌత్‌కి ఇది ఎన్నికల అరంగేట్రం. ఇటీవలే రామ మందిర శంకుస్థాపనలోను కంగన పాల్గొన్నారు. తాజాగా X (గతంలో ట్విటర్)లో కంగనా మండి నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించింది. అధికారికంగా పార్టీలో చేరడం గౌరవంగా భావిస్తున్నానని క్వీన్ అన్నారు.
''నా ప్రియమైన భారత్ ..భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎల్లప్పుడూ నా బేషరతు మద్దతును కలిగి ఉన్నాయి. నేడు బిజెపి జాతీయ నాయకత్వం.. నా జన్మస్థలం హిమాచల్ ప్రదేశ్, మండి (నియోజకవర్గం) నుండి 2024 లోక్‌సభ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ చేయడంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. పార్టీలో అధికారికంగా చేరడం నాకు గౌరవంగా ఆనందంగా భావిస్తున్నాను. నేను ఒక విలువైన కార్యకర్త, నమ్మకమైన ప్రజా సేవకురాలిగా బరిలో దిగేందుకు వేచి చూస్తున్నాను'' అని కంగన రనౌత్ పోస్ట్ చేశారు.
అయితే నెటిజన్లు క్వీన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి జంప్ చేసినందుకు కంగనను నిందించారు. మార్చి 23న కంగనా 37వ పుట్టినరోజు తర్వాత నామినేషన్ అవకాశం వచ్చింది. కంగన తన పుట్టినరోజును జరుపుకోవడానికి హిమాచల్‌లోని బగ్లాముఖి, జ్వాలా దేవి ఆలయాలను సందర్శించారు.
కంగనా రనౌత్ సినీకెరీర్ విషయానికి వస్తే.. తన ఆస్తి ఐశ్వర్యం అంతా ధారపోసి, అప్పులు చేసి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన పొలిటికల్ డ్రామా కమ్ బయోపిక్ 'ఎమర్జెన్సీ' విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రంతో దర్శకురాలిగా తిరిగి కంబ్యాక్ అవుతోంది. ఈ సినిమాలో కంగన ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది.
కంగన తెలుగులో 'కన్నప్ప' సినిమాలో కూడా నటించనుంది. ఇందులో 'బాహుబలి' స్టార్ ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తుండగా, మంచు విష్ణు టైటిల్ పాత్రలో అంటే.. మహా భక్తుడిగా కనిపించనున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించనున్నారు.