క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో ఏ మ‌హిళ‌నైనా అడ‌గండి.. వేధింపుల క‌థ చెబుతుంది!

కన్నడ పరిశ్రమలో #MeToo ఉద్యమం ఊపందుకుంది. ఇది నటీమ‌ణులపై లైంగిక వేధింపుల కథనాలను హైలైట్ చేస్తోంది.

Update: 2024-09-18 13:30 GMT

కన్నడ పరిశ్రమలో #MeToo ఉద్యమం ఊపందుకుంది. ఇది నటీమ‌ణులపై లైంగిక వేధింపుల కథనాలను హైలైట్ చేస్తోంది. మాలీవుడ్ లో జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక‌కు ధీటుగా శాండ‌ల్వుడ్ లోను ఒక నివేదిక‌ను రూపొందించేందుకు అదే త‌ర‌హా క‌మిటీ కావాల‌న్న డిమాండ్ ఊపందుకుంది. ఇటీవల ప్రముఖ కన్నడ నటి నీతూ శెట్టి సినీ పరిశ్రమలో నిశ్శబ్దం గురించి ఓపెనైంది. క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో నిశ్శ‌బ్ధం, ఆత్మసంతృప్తి, ప్రమాద‌క‌ర వ్య‌వ‌హారాల‌పై నీతూ ఓపెనైంది. `స్వీపింగ్ అండర్ ది కార్పెట్` విధానాన్ని అనుసరించే పరిశ్రమ ధోరణిని శెట్టి హైలైట్ చేస్తూ మీడియాతో మాట్లాడారు.

న్యూస్ 18తో సంభాషణలో నీతి శెట్టి ఇలా అన్నారు. ``ఒక చిన్న బడ్జెట్ చిత్రం కోసం స్క్రిప్ట్‌ను చదివి వినిపించాలని భావించిన ఒక చిత్ర బృందం కోసం నేను ప్ర‌ముఖ‌ నిర్మాతను కొంత సమయం కోసం అభ్యర్థించినప్పుడు.. నేను అవ‌న్నీ వ‌దిలేసి త‌న వ‌ద్ద‌కు రావాలని కోరాడు. గోవాలో వెకేష‌న్ ని ఆఫ‌ర్ చేసాడు`` అని తెలిపింది. మరో కన్నడ నటి మాట్లాడుతూ ``కన్నడ సినిమాల్లో నటించిన ఏ మహిళనైనా అడగండి. వారికి చెప్పుకోవ‌డానికి క‌చ్ఛితంగా ఒక‌ వేధింపుల కథ ఉంటుంది. జవాబుదారీతనం లేకుండా ప్రవర్తించగలమని భావించే వారు హద్దులు ఏమిటో నేర్చుకోవాలి.

నటి చేతన్ మాట్లాడుతూ .. మా ఫైర్ (ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈ క్వాలిటీ) ఆర్గనైజేషన్ త‌ర‌పున‌ రిటైర్డ్ జడ్జి సాయంతో కర్ణాటకలో మా సొంత‌ హేమ కమ్యూనిటీ నివేదికను కోరుతున్నామని చెప్పారు. లింగ స‌మాన‌త్వం, న్యాయం.. వీలైనంత త్వరగా నెర‌వేర్చాల‌ని కోరుకుంటున్నాము. మూడు నాలుగు నెలల్లో అది కావాలి అని అన్నారు.

కర్ణాటకలోని 1,550 మందికి పైగా సినీ ప్రముఖులు ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కన్నడ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులను పరిష్కరించడానికి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడానికి వారు ప్రభుత్వ మద్దతును కోరుతున్నారు. ఈ చర్య సెప్టెంబర్ 4న విడుదలైన కేరళ జస్టిస్ హేమ కమిటీ నివేదిక నుండి ప్రేరణ పొందింది. ఇది పరిశ్రమలో వేధింపులకు పాల్ప‌డేవారిపై చర్య తీసుకోవాలనే పిలుపున‌కు సంకేతంగా నిలిచింది.

Tags:    

Similar News