‘కన్నప్ప’లో అవ్రామ్ లుక్ చూశారా..

హీరో మంచి విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టకంగా రూపొందుతున్న చిత్రం కన్నప్ప.

Update: 2024-08-26 05:58 GMT

హీరో మంచి విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టకంగా రూపొందుతున్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది అని మేకర్స్ వరుస అప్డేట్స్ అందిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన మరొక స్పెషల్ పోస్టర్ ను కృష్ణాష్టమి సందర్భంగా విధులు చేశారు.


మంచు కుటుంబం నుంచి మరో తరం సినీ రంగంలోకి అడుగుపెడుతోంది. హీరో మంచు విష్ణు తన కుమారుడు అవ్రామ్‌ ని ‘కన్నప్ప’ సినిమాతో సినీ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ విషయం బయటకు రావడం, అవ్రామ్‌ పాత్రపై ఆసక్తి పెరగడం చూశాం. ఇప్పుడు, కృష్ణాష్టమి సందర్భంగా అవ్రామ్ లుక్ విడుదల చేయడం మరో స్పెషల్ అప్డేట్.


క్యూట్ గా ఉన్న అవ్రామ్‌ తన తండ్రి మంచు విష్ణు చిన్నప్పటి పాత్రలో నటించనున్నాడు. ఈ పోస్టర్ ను మోహన్ బాబు స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోగా, అవ్రామ్ లుక్ పై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అవ్రామ్‌ కు ఇది తొలి సినిమా కావడంతో, ఆయన పైన నెట్టింట ప్రత్యేకంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

పాజిటివ్ అంచనాలతో రాబోతోన్న ఈ సినిమా, మంచు కుటుంబం వారసుడికి పునాది వేయనుంది. తండ్రి దారిలోనే కుర్రవాడు కూడా తనకంటూ ప్రత్యేకత చూపించి ప్రేక్షకులను మెప్పిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ‘కన్నప్ప’ సినిమా విషయానికి వస్తే ఇది కేవలం ఓ ప్రాంతీయ చిత్రమే కాకుండా, పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ముఖ్యంగా, మంచు విష్ణు టైటిల్ పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో అగ్ర నటులు ప్రభాస్, అక్షయ్‌ కుమార్, శరత్‌కుమార్, మోహన్‌లాల్‌ లాంటి ప్రముఖులు కూడా ప్రత్యేకమైన పాత్రలలో మెప్పించబోతున్నారు. ఈ సినిమాలో వార్ సీన్స్, ఆర్ట్ వర్క్ తో పాటు, కన్నప్పగా విష్ణు చేసే పాత్ర చిత్రణ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోనుందట.

‘కన్నప్ప’ సినిమా తన జీవితంలో ప్రత్యేక స్థానం పొందనుందని ఇదివరకే మంచు విష్ణు తెలిపారు. ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ అందులో నటించడం నాకు గౌరవంగా ఉంది. ఓ నటుడిగా నా కెరీర్‌ లో బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుందని చెప్పాడు. ఇక సినిమాకు అగ్ర నటీనటులు తోడవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. కథలో కన్నప్ప భక్తుడు కాక ముందున్న ఆయన స్వరూపం, పోరాటం, వ్యక్తిత్వం చిత్రీకరించడం మాకు సవాల్‌గా అనిపించింది. అయినప్పటికీ, ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణం జరిపాం,.. అని విష్ణు గతంలో చెప్పిన మాటలు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి.

Tags:    

Similar News