'కాంతార' కోసం ది లయన్ కింగ్‌...!

కన్నడ చిత్రం కాంతార ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-06-12 05:42 GMT

కన్నడ చిత్రం కాంతార ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడంలో చిన్న సినిమాగా రూపొందిన కాంతార సినిమాకు పాన్‌ ఇండియా స్థాయిలో దాదాపుగా రూ.400 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. అంతటి విజయాన్ని సొంతం చేసుకోవడంతో కాంతార కు మరో పార్ట్‌ ను రూపొందించే పనిలో రిషబ్‌ శెట్టి ఇప్పటికే నిమగ్నమై ఉన్నాడు.

కాంతార లో చూపించిన కథకు ముందు జరిగే కథతో కాంతార కొత్త పార్ట్‌ ను రూపొందిస్తున్నారు. అందుకే టైటిల్ గా కాంతార : చాప్టర్ 1 గా నిర్ణయించారు. మొదటి పార్ట్‌ తో పోల్చితే ప్రస్తుతం రూపొందుతున్న కాంతార కు పదుల రెట్ల అధిక బడ్జెట్‌ ను ఖర్చు చేస్తున్నట్లు కన్నడ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

కాంతార : చాప్టర్ 1 లో గ్రాఫిక్స్ కి అత్యంత కీలక ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకోసం హాలీవుడ్‌ సినిమాలు అయిన ది లయన్ కింగ్‌, ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా సినిమాలకు వర్క్ చేసిన వీఎఫ్‌ఎక్స్ టీమ్‌ ను కాంతార కోసం దర్శకుడు రిషబ్‌ శెట్టి రంగంలోకి దించాడంటూ సమాచారం అందుతోంది.

కాంతార : చాప్టర్‌ 1 బడ్జెట్‌ లో మెజార్టీ భాగంను వీఎఫ్‌ఎక్స్ కోసం వినియోగిస్తున్నట్లు కన్నడ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం అత్యంత భారీ ఖర్చుతో సెట్స్ నిర్మాణం కూడా జరిగింది. కుందాపుర తీర ప్రాంతంలో ప్రస్తుతం కాంతార సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

అజనీష్ లోక్‌నాథ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి అరవింద్‌ కశ్యప్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ సినిమా కోసం దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న రిషబ్‌ శెట్టి గుర్రపు సారీ, కర్రసాము ఇంకా మార్షల్‌ ఆర్ట్స్ వంటి యుద్ద విధ్యల్లో ప్రావిణ్యం పొందాడు. త్వరలో విడుదల తేదీకి సంబంధించిన ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News