వోగ్ కవర్‌పై అగ్గి రాజేసిన మ్యారీడ్ బ్యూటీ
ఇద్దరు పిల్లలకు మమ్మీ అయినా కరీనా ఇప్పటికీ జీరో సైజ్ రూపంతో మతులు చెడగొడుతోంది.
రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి! జమీందారీ వ్యవస్థ కూడా అంతమైంది. కానీ సంస్థానాల తాలూకా వారసత్వం ఇంకా కొనసాగుతోంది. కపూర్ సంస్థానం నుంచి గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన కరీనా కపూర్ ఖాన్ బాలీవుడ్ అగ్ర కథానాయికగా ఏలడమే గాక, పటౌడీ సంస్థానాధీశుడు, స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌ని పెళ్లాడింది. ఈ జంట ప్రేమ, పెళ్లి, కిడ్స్ సహా హ్యాపీ లైఫ్ స్టైల్ గురించి తెలిసిందే.
ఇద్దరు పిల్లలకు మమ్మీ అయినా కరీనా ఇప్పటికీ జీరో సైజ్ రూపంతో మతులు చెడగొడుతోంది. ఇటీవలే విడుదలైన `క్రూ` సినిమాలో `బెబో ఈజ్ బ్యాక్` అని నిరూపించింది. కరీనా స్టన్నింగ్ మేకోవర్ కి యువతరం నటీనటులు కూడా ఫిదా అయిపోయారు. అయితే కరీనా ఈ రూపాన్ని మెయింటెయిన్ చేయడం కోసం ఏం చేస్తుందో తెలుసా?
తాజాగా వోగ్ కవర్ షూట్ కోసం కరీనా ఫోజులు ఇంటర్నెట్ లో హీటెక్కిస్తున్నాయి. బ్లాక్ కలర్ షోల్డర్ లెస్ ఫ్రాక్ లో బెబో సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. అయితే తన గ్లామర్ వెనక టాప్ సీక్రెట్స్ ని వోగ్ కి చెప్పింది బెబో. తన ఆరోగ్య నియమాల విషయానికొస్తే,.. సమయానికి ఆహారం తీసుకోవడం.. సమయానికి నిద్రపోచే అలవాటు తనకు ఉన్నాయని తెలిపింది. నేను గొప్ప ఆహార ప్రియురాలిని అని అందరికీ తెలుసు. రకరకాల వంటకాలను ప్రయత్నించడానికి ఇష్టపడతాను అని చెప్పింది. తన స్వచ్ఛమైన పంజాబీ మూలాలు ఆనందానికి కారణం. కానీ ఆమె తన ఆహారపు అలవాట్ల విషయంలో పెద్దగా కండిషన్లు పెట్టుకోదు. షేప్ ల కోసం కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటారు కానీ ఒక్కోసారి చీట్ మీల్ కూడా ఆనందమే... బర్గర్లు, పిజ్జాలు బాగా తింటాను`` అని తెలిపింది.
`కపూర్ ఫ్యామిలీ బ్యూటీ సీక్రెట్స్` గురించి చెప్పాలంటే అది వారి జీన్స్ లోనే ఉంది. తామంతా నవ్వుతూ ఆనందంగా గడిపేందుకు ఇష్టపడే వ్యక్తులం అని కరీనా చెప్పింది. చాలామంది అంగీకరించినట్లుగా, మంచి ఆహారం, ఉల్లాసాన్నిచ్చే సంభాషణలు, ప్రియమైనవారితో నాణ్యమైన సమయం గడపడం ఆనందించడం, ఆరోగ్యకరమైన జీవన విధానం అని తెలిపింది.