పిక్‌టాక్ : బ్లాక్ అండ్ వైట్‌లో కపూర్ ఖాన్ అందం
గతంలో ఎన్నో ప్రముఖ మ్యాగజైన్ కవర్స్ పై కనిపించిన ఈ అమ్మడు ఈసారి ది హాలీవుడ్ రిపోర్టర్ మేగజైన్ పై కన్నుల విందు చేసింది.
బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కరీనా కపూర్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి పాతిక సంవత్సరాలు కాబోతున్నా ఇప్పటికీ అదే అందం, ఆకర్షణతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ఆకట్టుకునే అందం మాత్రమే కాకుండా మంచి ఫిజిక్, నటన సామర్థ్యం ఉన్న కరీనా కపూర్ ఖాన్ మరోసారి తన అందమైన ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఎన్నో ప్రముఖ మ్యాగజైన్ కవర్స్ పై కనిపించిన ఈ అమ్మడు ఈసారి ది హాలీవుడ్ రిపోర్టర్ మేగజైన్ పై కన్నుల విందు చేసింది. బ్లాక్ అండ్ వైట్‌లో కవర్ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ తాన్యా ఘావ్రీ డిజైన్ చేసిన ఔట్ ఫిట్‌లో అందంగా కనిపించింది. ఈ విభిన్నమైన ఔట్ ఫిట్‌లో కరీనా కపూర్ ఖాన్ మరింత అందంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటిలాగే కరీనా ఫోటో వైరల్ అవుతోంది. హాలీవుడ్ రిపోర్టర్ కవర్‌పై గతంలో పలువురు హాలీవుడ్ స్టార్స్ కనిపించారు. ఇప్పుడు కరీనా కపూర్‌కి ఆ ఛాన్స్ రావడం అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. నాలుగు పదుల వయసులో ఇంకా యంగ్ అండ్ డైనమిక్‌గా కనిపిస్తున్న కరీనా కపూర్ పెళ్లి, పిల్లలతో సంతోషకర జీవితాన్ని సాగిస్తున్న విషయం తెల్సిందే.
కపూర్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కరీనా కపూర్ 2000 సంవత్సరంలో మొదటి సారి బాలీవుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు ఆరు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఇండియన్ హీరోయిన్స్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే ముద్దుగుమ్మల్లో టాప్ 5లోనే ఈమె ఉంటుంది అంటూ అంచనా. ఈమెతో సినిమాకు సౌత్ ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నించినా పారితోషికం విషయంలో మరీ ఎక్కువ డిమాండ్ చేస్తుందనే ఉద్దేశ్యంతో పక్కన పెట్టారు.
కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా ఇంగ్లీష్ ప్రాజెక్ట్‌లకు సైతం ఓకే చెబుతున్న కరీనా కపూర్ ఖాన్ మరో పదేళ్లు ఇంతే అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అందంగా బాలీవుడ్ సీనియర్ ముద్దుగుమ్మలు ఎవరూ ఉండరు అనేది వారి అభిప్రాయం. కరీనా కపూర్‌తో పాటు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చాలా మంది కనీసం కనిపించకుండా పోయారు. కానీ ఈ అమ్మడు మాత్రం ఇంకా అత్యధిక పారితోషికం దక్కించుకుంటూ టాప్ హీరోయిన్స్ జాబితాలో నిలిచింది.