పిల్ల‌ల భ‌ద్ర‌త విష‌యంలో బెబో హై అలెర్ట్

ముంబై -బాంద్రాలోని త‌మ‌ ఇంట్లో జరిగిన దొంగ‌త‌నం ప్ర‌య‌త్నంలో తన భర్త సైఫ్ అలీ ఖాన్‌పై ఇటీవల జరిగిన దాడి తర్వాత కరీనా కపూర్ అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది.

Update: 2025-02-16 18:30 GMT

ముంబై -బాంద్రాలోని త‌మ‌ ఇంట్లో జరిగిన దొంగ‌త‌నం ప్ర‌య‌త్నంలో తన భర్త సైఫ్ అలీ ఖాన్‌పై ఇటీవల జరిగిన దాడి తర్వాత కరీనా కపూర్ అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. త‌న ఇంటి చుట్టూ సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసింది. ప‌ర్మినెంట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంది.

తాజాగా కరీనా కపూర్ తన తండ్రి రణధీర్ కపూర్ 78వ పుట్టినరోజు వేడుకకు వెళుతున్న‌ప్ప‌టి ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. క‌రీనా కొన్ని ఫోటోలకు పోజులిచ్చిన తర్వాత తన కుమారులు తైమూర్, జెహ్‌ల ఫోటోల‌ను తీయొద్దని ఫోటోగ్రాఫ‌ర్ల‌ను రెక్వ‌స్ట్ చేసారు. పిల్లలను ఫోటోలు తీయొద్దని కరీనా కపూర్ అభ్య‌ర్థించ‌గానే మీడియా త‌న‌కు స‌ముచిత గౌర‌వాన్ని ఇచ్చింది. నా ఫోటోలు తీసి వెళ్లిపో. పిల్లల ఫోటోల గురించి నేను నీకు త‌ర్వాత‌ చెప్పాను! అంటూ ఒక ఫోటోగ్రాఫ‌ర్ తో క‌రీనా స‌న్నిహితంగా మాట్లాడారు. లోపలికి వెళ్ళే ముందు కనీసం రెండుసార్లు క‌రీనా ఇదే విష‌య‌మై అభ్య‌ర్థించారు.

గత నెలలో సైఫ్- కరీనా భద్రతా కారణాల దృష్ట్యా మీడియా వ్య‌క్తులు ఫోటోగ్రాఫ‌ర్ లు తమ పిల్లలను ఫోటోలు తీయొద్ద‌ని, ఇంటి వెలుపల గుమిగూడవద్దని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ జంట కార్యక్రమాలకు హాజరైనప్పుడు ఫోటోలు తీసుకోవ‌డానికి ఎలాంటి అభ్యంత‌రం లేదు. జనవరి 16న దొంగతనానికి ప్రయత్నించిన సమయంలో సైఫ్ వారి బాంద్రా నివాసంలో ఆరుసార్లు కత్తిపోట్లకు గురైన తర్వాత ఇది జరిగింది. ఈ కేసులో అరెస్టుల గురించి తెలిసిన‌దే.

ఢిల్లీ టైమ్స్‌తో సంభాషణలో సైఫ్ మాట్లాడుతూ...``నేను రక్తంతో తడిసి ఉన్న సినిమా సన్నివేశం అది. దాడి స‌మ‌యంలో గోడపై ఉంచిన‌ రెండు అలంకార కత్తులను తీసేశాము. తైమూర్ న‌న్ను అలాగే చూస్తూ ఉన్నాడు . నేను రక్తంతో తడిసిపోయాను. ఇంటి ప‌నివాడు హరి సహాయం చేస్తూ రెండు కత్తులు పట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఈ సీన్ వీరోచితంగా ఉంది. కనీసం ఆ క్షణంలో (నవ్వుతూ) `అతడిని పట్టుకుందాం` అని అన్నాను. కరీనా - `వద్దు, బయటకు వెళ్దాం! ఎందుకంటే మిమ్మ‌ల్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. నేను జెహ్‌ను ఇక్కడి నుండి బయటకు తీసుకురావాలి. ఎందుకంటే అతడు (చొరబాటుదారుడు) ఇంకా అక్కడే ఉన్నాడని నేను భావిస్తున్నాను. వారు ఇంకా ఎక్కువ మంది ఉండవచ్చు అని క‌రీనా అనుమానం వ్య‌క్తం చేసింది`` అని దాడి స‌న్నివేశం గురించి సైఫ్ వివ‌రించాడు.

Tags:    

Similar News