44 అయినా నాకు మ్యాకప్ అవసరం లేదు!
బాక్సాఫీస్ వద్ద తానో బ్రాండ్ నటిగా సత్తా చాటుతుంది. 44 ఏళ్ల వయసులోనూ కరీనా అంతే 30 ఏళ్ల భామలాగే హైలైట్ అవుతుంది.
బాలీవుడ్ లో కరీనా కపూర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ నాయికల్లో తనకంటూ ప్రత్యేకమై న గుర్తింపు ఉంది. తనదైన మార్క్ సినిమాలో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. నవతరం భామలు ఎంత మంది వచ్చినా? తనకు తానే పోటీ తప్ప...తనకెవ్వరూ పోటీ కాదు. కరీనా కపూర్ తర్వాత వచ్చిన దీపికా పదుకొణే, కత్రినా కైఫ్ లాంటి భామలు తన స్థానంలోకి చేరుకోవాలని ప్రయత్నించారు గానీ...కరీనా ఆ ఛాన్స్ ఇవ్వలేదు.
ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లిపోయిన తర్వాత కరీన మరింత మెరుగ్గా సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కరీనాని సైతం పక్కకు నెట్టాలని నవతరం భామలు కొన్ని ప్రయత్నాలుచేసారు కానీ పనవ్వలేదు. ఇటీవల లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతోనూ అమ్మడు మోత మోగిస్తుంది. బాక్సాఫీస్ వద్ద తానో బ్రాండ్ నటిగా సత్తా చాటుతుంది. 44 ఏళ్ల వయసులోనూ కరీనా అంతే 30 ఏళ్ల భామలాగే హైలైట్ అవుతుంది. తాజాగా ఈ విషయం గురించి ఓపెన్ అయింది.
`సినిమాల్లో యవ్వనంగా కనిపించాలని నేనెప్పుడు అనుకోను. తొలి నుంచి అంకిత భావంతో పనిచేయడం అలవాటు. ఇప్పుడు అదే అనుసరిస్తున్నా. నన్ను నేను నిరంతరం జాగ్రత్తగా, ఫిట్ గా ఉండేలా చూసుకుంటా. వయసు అనేది అందంలో ఓ భాగం మాత్రమే. వయసు ను స్వీకరిచడం, ప్రేమించడం ఓ బాధ్యత లాంటింది. ఇప్పుడు నా యవసు 44. అయినా నాకు ఎలాంటి మ్యాకప్ అసవరం లేదు.
నా యవసును ప్రతిబింబించే పాత్రలను పోషించాలనుకుంటున్నా. ఈ మాట ఎక్కడైనా గర్వంగా చెబుతాను` అని అన్నారు. అలాగే హాలీవుడ్ సినిమాలపై కూడా అనాసక్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాను ఇప్పటికే జీవితంలో సాధించాల్సింది సాధించానని, కొత్తగా హాలీవుడ్ అంటూ పరుగులు తీయడం ఇష్టం లేదని..భారత్ లోనే ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది.