వాట్ ఏ సెలక్షన్ కరీనా జీ..!
జానే జాన్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన కరీనా కపూర్ మొదటి ప్రాజెక్ట్ తోనే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
ఒక కథ స్పూర్తితో ఎన్నో కథలను రాసుకోవచ్చు. ఏ విషయాన్ని ఇద్దరు వ్యక్తులు ఒకేలా చూడలేరు అన్నట్టుగా జపనీస్ భాషలో వచ్చిన ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ కథ స్పూర్తితో బాలీవుడ్ లో జానే జాన్ సినిమా రూపొందించారు. సుజయ్ ఘోష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కరీనా కపూర్, జై దీప్, విజయ్ వర్మ నటించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు మలయాళ దర్శకుడు చేసిన దృశ్యం సినిమా గుర్తుకొస్తుంది. దృశ్యం 1, 2 సినిమాలు రెండు సౌత్ ఆడియన్స్ తో పాటుగా హిందీలో కూడా హిట్ అయ్యాయి.
అయితే ఈ సినిమాలకు మూల కథ కూడా డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ అని తెలిసిందే. ఈ జపనీస్ కథా స్పూర్తితోనే దృశ్యం సినిమా తీశాడు జీతు జోసెఫ్. అయితే ఇప్పుడు అదే కథను మరోలా చెప్పాలని ప్రయత్నించాడు సుజయ్ ఘోష్.
జానే జాన్ సినిమాకు దృశ్యం సినిమాకు కథ తాలూకా పోలికలు ఉన్నా రెండు సినిమాల కథనం వేరు సినిమా ఎక్స్ పీరియన్స్ వేరు. హిందీ ఆడియన్స్ కి జానే జాన్ ఒక మంచి సస్పెన్స్ మూవీగా అలరిస్తుంది.
సినిమాలో కరీనా కపూర్, జైదీప్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. కరీనా కపూర్ మొదటి వెబ్ మూవీగా జానే జాన్ సినిమా ఇంప్రెస్ చేసింది. అయితే ఈ సినిమాకు క్రిటిక్స్ రివ్యూ సరిగా లేకపోయినా ఆడియన్స్ పర్సనల్ ఎక్స్ పీరియన్స్ మాత్రం బాగుందని చెబుతున్నారు. సినిమాను అంతా డైరెక్టర్ తీసుకెళ్లిన విధానం.. ఆ సెటప్ అంతా కూడా ఆడియన్స్ కు మంచి థ్రిల్ కలిగిస్తుందని అంటున్నారు.
ఒక సినిమాకు భిన్నమైన అభిప్రాయాలు రావడం కామనే. జానే జాన్ సినిమాకు కూడా ఎక్కువమంది నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నా థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా బాగా ఎక్కేస్తుందని తెలుస్తుంది. జానే జాన్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన కరీనా కపూర్ మొదటి ప్రాజెక్ట్ తోనే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక మీదట కరీనా డిజిటల్ రంగంలో కూడా దూసుకెళ్తుందని చెప్పొచ్చు.దృశ్యం చూసిన ఆడియన్స్ జానే జాన్ కి కనెక్ట్ అవకపోవచ్చు కానీ డైరెక్షన్, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం జానే జాన్ ని నిలబెట్టాయని చెప్పొచ్చు.