రాజకీయాల్లోకి కరిష్మా-కరీనా సిస్టర్స్?
లోక్‌సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా హెడ్‌లైన్స్‌లోకొస్తున్నాయి. అనేక పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి
లోక్‌సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా హెడ్‌లైన్స్‌లోకొస్తున్నాయి. అనేక పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇటీవల బిజెపి లోక్‌సభ స్థానానికి తమ అభ్యర్థిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ప్రతిపాదించింది. ఇంతకుముందే నటుడు గోవిందా శివసేనలో చేరారు. ముంబై వెస్ట్ నుంచి పోటీ చేస్తారని గుసగుస వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే బాలీవుడ్ సిస్టర్స్ కరీనా కపూర్, కరిష్మా కపూర్ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను కలవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే కపూర్లకు శివసేనతో చాలాకాలంగా బలమైన అనుబంధం ఉందనేది కొద్దిమందికే తెలుసు. చలనచిత్ర చరిత్రకారుడు దిలీప్ ఠాకూర్ దీనిపై మాట్లాడుతూ, ``RK స్టూడియో లోగోను శివసేనకు చెందిన అచ్రేకర్ రూపొందించారు. బాలాసాహెబ్ థాకరే - రాజ్ కపూర్ .. థాకరే కుటుంబం చాలా సన్నిహితంగా ఉండేవారు`` అని తెలిపారు. కపూర్ నటించిన `మేరా నామ్ జోకర్` ప్రేక్షకులను ఆకట్టుకోని క్రమంలో అప్పట్లోనే రాజ్ కపూర్ ఠాక్రే కోసం ఒక ప్రత్యేక షోను వేసారు. కపూర్- థాక్రే స్నేహితులు ఇద్దరు సినిమాను ఎలా రక్షించాలో చర్చించార``ని దిలీప్ ఠాకూర్ తెలిపారు.
అయితే తాజా వార్తల ప్రకారం.. కరిష్మా మాత్రమే రాజకీయాల్లోకి చేరుతుందా? లేక కరీనా కపూర్ కూడా రాజకీయాల్లో చేరేందుకు అవకాశం ఉందా? అన్నది తెలియడం లేదు. దీనిపై అధికారికంగా ఆయా పార్టీలు ప్రకటించాల్సి ఉంటుంది. ఇంతకుముందే వెటరన్ స్టార్ గోవింద ఏకనాథ్ షిండే శివసేనలో చేరారు. ఇప్పుడు కపూర్ సిస్టర్స్ కూడా అదే పార్టీలో చేరితో గ్లామర్ మరింత పెరుగుతుంది.