భూల్ భులయ్యా-3.. ఆ ఎఫెక్ట్ పడుతుందా?

పాపులర్ హీరోయిన్ విద్యా బాలన్, యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రీ, యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రల్లో భూల్ భులయ్యా 3 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే

Update: 2024-10-16 07:30 GMT

పాపులర్ హీరోయిన్ విద్యా బాలన్, యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రీ, యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రల్లో భూల్ భులయ్యా 3 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన భూల్ భులయ్యా, భూల్ భులయ్యా 2 సినిమాలకు కొనసాగింపుగా.. దీపావళి కానుకగా భూల్ భులయ్యా 3 నవంబర్ 1వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సాలిడ్ బజ్ క్రియేట్ చేశాయి. ప్రమోషనల్ కంటెంట్ లో హారర్ ఎలిమెంట్స్ అండ్ గ్రాఫిక్ ఎలిమెంట్స్ బాగున్నాయి. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ మంజూలిక పాత్రల్లో అదరగొట్టారు. ముఖ్యంగా ట్రైలర్‌ లోని హారర్ సీన్స్‌ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. కార్తీక్, తృప్తి దిమ్రి మధ్య ఉన్న రొమాంటిక్ సీన్స్.. ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమా మంచి హిట్ అవుతుందని అనేక మంది అంచనా వేస్తున్నారు.

అయితే ట్రైలర్ లో మేకర్స్.. కొన్ని సీన్స్ లో బెంగాలీ మహిళలు క్షుద్రపూజలు చేస్తున్నట్లు చూపించారు. దీంతో అనేక మంది ఆ సీన్స్ ను వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. అయితే మేకర్స్ హారర్ ఎలిమెంట్స్ కోసమే అలా చూపించినా.. ఆ విషయం చర్చనీయాంశంగా మారింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ.. అనేకమంది నెటిజన్లు స్పందిస్తున్నారు. మూవీ రిలీజ్ అయ్యాక బెంగాలీ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని అంటున్నారు.

కాగా.. 2007లో బ్లాక్ బస్టర్ భూల్ భులయ్యా ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియదర్శన్ డైరెక్ట్ చేయగా.. ప్రముఖ బ్యానర్ టీ సిరీస్ నిర్మించింది. విద్యా బాలన్ మంజులిక పాత్రను పోషించారు. అక్షయ్ కుమార్, షైనీ అహుజా, అమీషా పటేల్, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, మనోజ్ జోషి, అస్రానీ, విక్రమ్ గోఖలే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఆ సినిమా.. భారీ వసూళ్లను సాధించింది.

ఆ తర్వాత 2022లో భూల్ భులయ్యా 2 విడుదలైంది. అనీస్ బజ్మీనే దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో టబు, కియారా అడ్వానీ, కార్తీక్ నటించారు. ఆ సినిమా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ గా నిలిచింది. ఇప్పుడు థర్డ్ పార్ట్ విడుదల అవుతుంది. బెంగాలీ మహిళల అంశంతో పాటు పలు విషయాలపై నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మరి మూవీ రిలీజ్ అయ్యాక.. వాటిని సినీ ప్రియులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News