హీరో-నిర్మాతలపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
హీరోలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఇలాంటి సందేహాలు రావడం సహజమే.ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ సూర్య హీరోగా 44వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బారాజ్ స్టార్ హీరోలు, దర్శక-నిర్మాతల్ని ఉద్దేశించి ఓ అవార్డు ఫంక్షన్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దళపతి విజయ్, తల అజిత్ వంటి పెద్ద హీరోలతో సినిమాలు తీయడమే దర్శకనిర్మాతల లక్ష్యం కాకూడదని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటిని తాను పెద్ద విషయంగా పరిగణించనని అన్నారు. దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు కోలీవుడ్ సహా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. కార్తీక్ సుబ్బరాజ్ అంటే కామ్ గోయింగ్ పర్సన్ కోలీవుడ్ లో పేరుంది.
ఇంతవరకూ ఇలాంటి వ్యాఖ్యలు ఏ వేదికపైనా చేయలేదు. దర్శకుడిగా తనకు వచ్చిన సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవడంతో తప్ప వివాదాల్లో వేలు పెట్టడం ఆయన అలవాటు లేని పని. కానీ తొలిసారి విజయ్- అజిత్ లాంటి స్టార్లనే ఉద్దేశించి మాట్లాడటంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది. కార్తీక్ ఆ హీరోలిద్దర్నీ అప్రోచ్ అయితే డేట్లు ఇవ్వలేదా? ఆ కోణంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసారా? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హీరోలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఇలాంటి సందేహాలు రావడం సహజమే.ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ సూర్య హీరోగా 44వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'కంగువ' సినిమా చేస్తోన్న సమయంలో ఎంతో మంది దర్శకుల కథలు విన్న సూర్య చివరిగా కార్తీక్ కథకి ఒకే చెప్పాడు. ఈనెలలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ అండమాన్ లో మొదలవుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సినిమానే గాక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరీగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'గేమ్ ఛేంజర్' చిత్రానికి కూడా కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఒకే ఒక్కడు' లా ఉంటుందని అంచనాలున్నాయి. అనువాద చిత్రాలతో కార్తీక్ సుబ్బరాజ్ కి తెలుగులోనూ మంచి పేరుంది. 'గేమ్ ఛేంజర్ 'హిట్ అయితే పాన్ ఇండియాలో మరింత ఫేమస్ అవుతాడు.