సూర్య 44 ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వబోతుందా..?
కోలీవుడ్ స్టార్ సూర్య ఇప్పటికే కంగువ సినిమాతో పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయగా సూర్య 44వ సినిమా కూడా అదే టార్గెట్ తో వస్తుంది.
100 కోట్లపైన బడ్జెట్ పెట్టే ప్రతి సినిమాను సాధ్యమైనంతవరకు నేషనల్ లెవెల్ లో రిలీజ్ చేసి పాన్ ఇండియా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు మేకర్స్. తెలుగులో కొనసాగుతున్న ఈ హంగామా ఇప్పుడు కోలీవుడ్ కి పాకింది. మన స్టార్ హీరోలంతా ఎలాగైతే వరుసగా చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారో అలానే కోలీవుడ్ స్టార్స్ కూడా తమ సినిమాలను నేషనల్ లెవెల్ ఆడియన్స్ కోసం గురి పెడుతున్నారు. కోలీవుడ్ స్టార్ సూర్య ఇప్పటికే కంగువ సినిమాతో పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయగా సూర్య 44వ సినిమా కూడా అదే టార్గెట్ తో వస్తుంది.
అంతేకాదు ఈ సినిమా ఆడియన్స్ కు మరో షాక్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. కంగువ తర్వాత సూర్య చేసే నెక్స్ట్ సినిమా కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తుంది. సూర్య డిఫరెంట్ గెటప్, క్యారెక్టరైజేషన్ తో వస్తున్న ఈ సినిమా కథ ప్రకారం రెండు భాగాలుగా సినిమాను రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. సూర్య 44వ సినిమా టూ పార్ట్స్ గా తీస్తున్నారని తెలుస్తుంది. ఐతే చిత్ర యూనిట్ ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నారట.
సూర్యతో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్నారు. కోలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన కార్తీక్ సుబ్బరాజు ఈసారి సూర్యతో నెక్స్ట్ లెవెల్ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా అనౌన్స్ మెంట్ గ్లింప్స్ తోనే మంచి బజ్ పెంచిన మేకర్స్ సూర్య ఫ్యాన్స్ కి ఈ సినిమా సూపర్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని చెప్పుకుంటున్నారు. శివ దర్శకత్వంలో వస్తున్న కంగువ సినిమా సూర్య నట విశ్వరూపం చూపించబోతుందని తెలుస్తుండగా. సూర్య 44 అంతకుమించి అనిపించేలా ప్లాన్ చేస్తున్నాడట కార్తీక్ సుబ్బరాజు.
సూర్యకు తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే తెలుగు ఆడియన్స్ మెచ్చేలా ఈ సినిమాలో ప్రత్యేకమైన అంశాలు ఉండేలా చేస్తున్నారట. మొత్తానికి ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉంది కాబట్టి సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఉంటుందేమో చూడాలి. సూర్య 44 సినిమా 2025 సమ్మర్ టార్గెట్ తో తెచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. పూజా హెగ్దేకి ఆఫ్టర్ గ్యాప్ వచ్చిన ఈ సినిమాపై ఆమె ఫ్యాన్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.