ఆ సీక్వెల్ కంటెంట్ ఇలా ఉంటుందా?
కార్తీ-మిత్రన్ కాంబినేషన్ లో `సర్దార్` కి సీక్వెల్ గా సర్దార్ -2 ప్రకటించిన నాటి నుంచి అంచనాలు తారా స్థాయికి చేరుతోన్న సంగతి తెలిసిందే.
కార్తీ-మిత్రన్ కాంబినేషన్ లో `సర్దార్` కి సీక్వెల్ గా సర్దార్ -2 ప్రకటించిన నాటి నుంచి అంచనాలు తారా స్థాయికి చేరుతోన్న సంగతి తెలిసిందే. ఈసారి స్పై థ్రిల్లర్ ని ఎలా రూపొందించబోతున్నారు? అన్న ఎగ్జైట్ మెంట్ అందరిలోనూ కనిపిస్తుంది. కొత్తగా ఎలాంటి కథని తెరపైకి తెస్తున్నారని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి వైరల్ అవుతుంది. సీక్వెల్ లో కార్తీ మరింత భిన్నంగా కనిపించనున్నాడు. అందుకు అనుగుణంగా స్క్రిప్ట్ ని డిజైన్ చేస్తున్నారు.
మాదక ద్రవ్యాలు..మహిళలు అక్రమ రవాణా నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని కథ సిద్దం చేసారు. చెడు అలవాట్ల వల కలిగే దుష్పలితాలపై యువతకు అవగాహన కల్పించేలా ఈ చిత్రం ఉండబోతుందని చిత్ర వర్గాల నుంచి అందుతోంది. కార్తీ పాత్రను మొదటి భాగాన్ని మించి మరింత ఆసక్తికరంగా మలచబోతున్నారుట. కథనం ఆద్యంతం ప్రేక్షకుల్ని పరుగులు పెట్టిస్తుందం టున్నారు. మాదక ద్రవ్యాలు..మహిళల అక్రమ రవాణా పాయింట్ అనేది కొత్తదేం కాదు. కానీ దీన్నీ మిత్రన్ మార్క్ మేకింగ్..స్క్రీన్ ప్లేతో ప్రత్యేకంగా హైలైట్ చేయబోతున్నారని చెప్పొచ్చు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. జూన్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిచాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీ `వా వతియారే` షూటింగ్ బిజీగా ఉన్నాడు. ఇది జూన్ కల్లా పూర్తవుతుంది. సర్దార్ సీక్వెల్ కంటే కార్తీ కొన్ని ప్రాజెక్ట్ లు కమిట్ అయ్యాడు. అందులో కొన్ని సీక్వెల్స్ కూడా ఉన్నాయి. కానీ వాటికంటే ముందుగా సర్దార్ -2నే పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ స్పై థ్రిల్లర్ లో `సర్దార్` ని వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 1980 లో ఇండియన్ ఇంటిలిజెన్స్ దేశం భద్రత కోసం ఓ గుఢాచారిని తయారు చేసింది. అందుకోసం ఓ రంగస్థలం నటుడ్ని గుఢచారిగా తయారు చేసి ఆపరేషన్ లోకి దించారు. ఆ కథనే సర్దార్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సీక్వెల్ స్టోరీ అందుకు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.