థర్డ్ హ్యాండ్ కారు కొన్న స్టార్ హీరో

బాలీవుడ్ హీరోలలో కార్తీక్ ఆర్యన్ సైతం కార్ల మీద ఇష్టం చూపిస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కార్ల అంటే తనకు ఎంత మక్కువో వివరించారు.

Update: 2024-10-10 04:10 GMT

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కార్లు, బైకులపై మక్కువ చూపిస్తుంటారు. మార్కెట్ లోకి వచ్చిన కొత్త మోడల్స్ ఏవైనా నచ్చాయంటే చాలు, ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా వెంటనే కొనుగోలు చేస్తుంటారు. కార్లు అంటే అమితమైన ఇష్టం చూపించే టాలీవుడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగచైతన్య వంటి వారున్నారు. బాలీవుడ్ హీరోలలో కార్తీక్ ఆర్యన్ సైతం కార్ల మీద ఇష్టం చూపిస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కార్ల అంటే తనకు ఎంత మక్కువో వివరించారు.

ఇప్పటికే అనేక లగ్జరీ కార్లు మెయింటైన్ చేస్తున్న కార్తీక్ ఆర్యన్.. ఒకానొక టైంలో తనవద్ద ఎలాంటి కారు లేదని తెలిపారు. అప్పుడు ఓ థర్డ్ హ్యాండ్ కారు కొనుక్కొని, దానికి సుమారు 35 వేల రూపాయలు ఖర్చు పెట్టినట్లుగా చెప్పారు. ఎంత కష్టపడైనా లైఫ్ లో బాగా సెటిలై ఖరీదైన కార్లు కొనాలని అప్పుడే ఫిక్స్ అయ్యానని, ఈ క్రమంలో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్లు కూడా ఉపయోగించాని అన్నారు.

యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తాను కొనుగోలు చేసిన ఫస్ట్ కాస్ట్లీ కారు లంబోర్ఘిని అని కార్తీక్ ఆర్యన్ తెలిపారు. ప్రస్తుతం తన గ్యారేజ్ లో రేంజ్ రోవర్, మినీ కూపర్, మెక్ లారెన్ వంటి పలు లగ్జరీ కార్లు ఉన్నట్లుగా వెల్లడించారు. ఇప్పటికైతే తన కార్ల కలెక్షన్స్ పై హ్యాపీగా ఉన్నానని చెప్పిన ఆర్యన్.. ఫ్యూచర్ లో ఇంకెన్ని కార్లు కొంటానో తెలియదని అన్నారు.

ఇక కార్తీక్ ఆర్యన్ కెరీర్ విషయానికొస్తే, ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 2011లో 'ప్యార్ కా పంచ్‌నామా' అనే సినిమాతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 'ఆకాష్ వాణి' 'కాంచీ: ది అన్‌బ్రేకబుల్' వంటి హిందీ రొమాంటిక్ చిత్రాల్లో నటించాడు కానీ, ఇవి అతని కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇదే క్రమంలో 'ప్యార్ కా పంచనామా 2', 'సోను కే టీటూ కీ స్వీటీ' సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించి అతన్ని హీరోగా నిలబెట్టాయి.

కార్తీక్ ఆర్యన్ నటించిన 'లూకా చుప్పీ' 'పతి పత్నీ ఔర్ వో' 'లవ్ ఆజ్ కల్, 'ధమాకా' 'ఫ్రెడ్డీ', 'సత్యప్రేమ్ కి కథ' చిత్రాలు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. 'చందు ఛాంపియన్' బయోపిక్‌ కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఆయన పోషించిన మురళీకాంత్ పేట్కర్ పాత్రకు ప్రశంసలు దక్కాయి. 'భూల్ భూలయ్యా 2' తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'భూల్ భులయ్యా 3' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో విద్యా బాలన్, మాధురీ దీక్షిత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన ఈ హార్రర్ కామెడీ ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది కార్తీక్ ఆర్యన్ కు మరో విజయాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News