ఏడాది తర్వాత స్వీట్‌ తిన్న హీరో...!

ఒకప్పుడు హీరోలు తమ పాత్రల కోసం పడ్డ కష్టంతో పోల్చితే ప్రస్తుత యంగ్‌ హీరోలు పది రెట్లు అంతకు మించి కష్టపడుతున్నారు

Update: 2024-02-02 14:30 GMT

ఒకప్పుడు హీరోలు తమ పాత్రల కోసం పడ్డ కష్టంతో పోల్చితే ప్రస్తుత యంగ్‌ హీరోలు పది రెట్లు అంతకు మించి కష్టపడుతున్నారు. ఒకప్పుడు చిన్న యాక్షన్ సన్నివేశాలను కూడా డూప్‌ లతో చేయించే వారు. కానీ ఇప్పుడు ఎలాంటి యాక్షన్ సన్నివేశాలను అయినా కూడా రియల్‌ గానే హీరోలతో చేయిస్తూ ఉన్నారు.

ఇక హీరోలు ప్రతి సినిమా కోసం కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. సినిమాలోని పాత్రల కోసం నెలల తరబడి కష్టపడుతూ ఉన్నారు. కొంత మంది సినిమా పాత్ర కోసం సిక్స్ ప్యాక్‌, ఎయిట్‌ ప్యాక్ బాడీలను ట్రై చేయడంతో పాటు కండలు పెంచడం లేదంటే లావు పెరగడం వంటివి చేస్తూ ఉన్నారు.

తాజాగా బాలీవుడ్‌ హీరో కార్తిక్‌ ఆర్యన్‌ 'చందు ఛాంపియన్‌' సినిమాలో నటించాడు. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది. సినిమా పూర్తి అయిన తర్వాత హీరో కార్తిక్‌ ఆర్యన్‌ కి దర్శకుడు కబీర్ ఖాన్‌ రసమలాయ్‌ స్వీట్ తినిపించాడు. ఏడాది తర్వాత కార్తిక్ ఆర్యన్‌ స్వీట్ తినడం ప్రస్తుతం బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

చందు ఛాంపియన్ సినిమాలో కార్తిక్‌ ఆర్యన్‌ సన్నగా కనిపించాల్సి ఉందట. అందుకే సినిమా కోసం చాలా సన్నబడ్డ కార్తిక్‌ ఆర్యన్‌ మళ్లీ బరువు పెరగకూడదు అనే ఉద్దేశ్యంతో ఏడాది కాలంగా చక్కెర, స్వీట్స్ తినకుండా ఉంటున్నాడు. ఏడాది కాలం పాటు పూర్తిగా స్వీట్స్ కి దూరంగా ఉన్న కార్తిక్‌ షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత స్వీట్ తిన్నాడు.

ఏడాది తర్వాత రసమలాయ్‌ తింటూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. 8 నెలల పాటు డే అండ్‌ నైట్‌ కష్టపడి షూటింగ్‌ చేశాం. తాము పడ్డ కష్టంకు కచ్చితంగా ప్రతిఫలం ఉంటుందనే నమ్మకం ఉందని హీరో కార్తిక్‌ ఆర్యన్ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News