సినిమా అన‌గానే ప్రేమించిన అమ్మాయి వ‌దిలేసింది!

అన్నింటిని దాటుకుని వ‌చ్చాడు కాబ‌ట్టే నేడు అభిమానులు నీరాజ‌నాలు ప‌డుతున్నారు.

Update: 2024-07-16 13:30 GMT

బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్య‌న్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ అయిన సంగ‌తి తెలిసిందే. ఔట్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ నుంచి వ‌చ్చి తానో స్టార్ గా ప్రూవ్ చేసుకున్నాడు. సుషాంత్ సింగ్ రాజ్ పుత్ రేంజ్ లో ఫేమ‌స్ అవుతున్నాడు. ఎదిగే క్ర‌మంలో ఎన్నో అవ‌మానాలు, విమ‌ర్శ‌లు ఎదుర్కున్నాడు. అన్నింటిని దాటుకుని వ‌చ్చాడు కాబ‌ట్టే నేడు అభిమానులు నీరాజ‌నాలు ప‌డుతున్నారు.

బ్యాక్ గ్రౌండ్ లేని వాడు వ‌చ్చి స‌క్సస్ అయితే ఆ కిక్ అలాగే ఉంటుంది. అది బ్యాక్ గ్రౌండ్ లేని వాడి మాత్ర‌మే ఆస్వాదించగ‌ల‌డు. ఇటీవ‌లే `చందు ఛాంపియ‌న్` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. భారీ అంచ‌నా ల‌మ‌ద్య రిలీజ్ అయిన సినిమా యావ‌రేజ్ గా ఆడింది. ప్ర‌స్తుతం `భూల్ భుల‌య్య‌-3`లో న‌టిస్తున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో బిఏ మ్యాన్ యార్ అనే పాడ్ కాస్ట్ లో త‌న పాస్ట్ లైఫ్ లైఫ్ లోకి వెళ్లిపోయాడు.

`కాలీజ్ లో ఓ అమ్మాయిని చూసి రోజూ న‌వ్వేవాడిని. కానీ నా ఫీలింగ్ నేరుగా క‌లిసి చెప్పేంత ధైర్యం లేదు. తర్వాత కొన్నాళ్ల‌కు క‌లిసాం. కానీ ఒకరోజు మాత్రం బ్రేక‌ప్ చెప్పింది. నీకు న‌ట‌న కావాలంటే న‌న్ను మ‌ర్చిపో. న‌టుడి జీవితాన్ని నేను హ్యాండిల్ చేయ‌ల‌ను. పైగా గ్యారెంటీ లేని లైఫ్ అది. అక్క‌డ నేను అంత సౌక‌ర్యంగా ఉండ‌లేను అని ముఖం మీద‌నే చెప్పేసింది. దీంతో చాలా బాధ‌ప‌డ్డాను. ఆడిష‌న్స్ కి వెళ్లిన‌ప్పుడు ఎన్నోసార్లు రిజెక్ట్ అయ్యాను.

ఎందుకిలా జ‌రిగుతుంద‌ని...చాలా ఆవేద‌న చెందాను. చనిపోవాల‌నిపించింది. ఊరికే కోపం ప్ర‌స్టేష‌న్ వ‌చ్చేది. కానీ అన్ని త‌గ్గించుకుని సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలపై ఫోక‌స్ చేసాను. అదే నా జీవితాన్ని మార్చేసింది. అక్క‌డ నుంచి అవ‌కాశాలు రావ‌డం మొద‌లైంది. నాకంటూ అభిమానుల్ని సంపాదిం చుకున్నాను. వాళ్ల కార‌ణంగా నా ఒంట‌రి త‌నాన్ని దూరం చేసుకున్నాను` అని అన్నాడు.

Tags:    

Similar News