ప్రతీసారీ క్లిక్కవ్వడం కష్టమే కార్తికేయ

అయితే కార్తికేయ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ కామెడీ ప్రతీ సారి వర్కౌట్ అవుతుందని చెప్పలేం

Update: 2023-09-15 13:30 GMT

కార్తిక్ సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టి వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు హీరో కార్తికేయ. కానీ 'ఆర్ ఎక్స్ 100' తర్వాత ఆ స్థాయి విజయం ఆయనకు దక్కలేదు. దీంతో సాధ్యమైనంత త్వరగా ఓ హిట్ కొట్టాలనే గట్టి పట్టుదలతో ఉన్న ఆయనకు వరుస ఫ్లాప్ ల తర్వాత రీసెంట్ గా బెదురులంక 2012 పర్వాలేదనిపించే హిట్ దక్కింది. కామెడీ జానర్ లో వచ్చిన ఈ చిత్రం ఆయన్ను గట్టెక్కించింది. అయితే ఇప్పుడాయన తాను ఒప్పుకున్న మూడు చిత్రాలను క్యాన్సిల్ చేసినట్లు తెలిసింది.

వివరాళ్లోకి వెళితే.. కార్తికేయ ఆర్ఎక్స్ 100 తర్వాత వరుసగా హిప్పి, గుణ 369, 90 ఎంఎల్​, చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క వంటి చిత్రాలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయాణంలోనే గ్యాంగ్ లీడర్​, అజిత్​ వాలిమై వంటి చిత్రాల్లో ప్రతినాయకుడిగానూ నటించి ప్రేక్షకుల్ని అలరించేందుకు గట్టిగానే ట్రై చేశారు. కానీ ఏవీ వర్కౌట్ కాలేదు.

ఈ క్రమంలోనే ఆయన ఇటీవలే 'బెదురులంక 2012' అనే భిన్న కాన్సెప్ట్ కథతో బాక్సాఫీస్‌ ముందుకొచ్చారు. అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం అనుకోకుండా హిట్ అయిపోయింది. ఈ చిత్రానికి పోటీగా వచ్చిన వరుణ్ తేజ్​ గాండీవ‌ధారి అర్జున‌, మలయాళ స్టార్ హీరో కింగ్ ఆఫ్ కోతా, కన్నడ సూపర్ హిట్ మూవీ బాయ్స్ హాస్ట‌ల్ వంటి సినిమాలు ఫ్లాప్ అందుకోగా బెదురులంక మాత్రం హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సెక్సెస్ కు మెయిన్ రీజన్ కామెడీ.

అందుకే కార్తికేయ తాను నెక్ట్స్ చేయబోయే చిత్రాలను కామెడీ బేస్ మీద చేయలాని అనుకుంటున్నారట. అందుకే తాను ఎంచుకున్న మూడు యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాలను క్యాన్సిల్ చేశారట. కామెడా జానర్ స్క్రిప్ట్ కోసమే చూస్తున్నారట. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ఓ చిత్రాన్ని మాత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో పూర్తి చేశారట.

అయితే కార్తికేయ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ కామెడీ ప్రతీ సారి వర్కౌట్ అవుతుందని చెప్పలేం. ఎందుకంటే అందులోనూ కొత్త దనం కోరుకుంటారు ప్రేక్షకులు. రొటీన్ కామెడీతో నవ్వించడానికి ప్రయత్నిస్తే.. ఏమాత్రం మోహమాటం లేకుండా పక్కనపెట్టేస్తారు. వాస్తవానికి ఓ సినిమా స్క్రీన్ ప్లే, చూపించే విధానం ఆసక్తిగా, క్యూరియాసిటీగా ఉంటే.. అది కామెడీ, హారర్, యాక్షన్, మెలోడ్రామ్ ఏదైనా సరే సినిమాకు హిట్ స్టేటస్ ను అందిస్తారు ప్రేక్షకులు. చూడాలి మరి కార్తికేయ తీసుకున్న కామెడీ జానర్ నిర్ణయం ఎంత వరకు ఫలిస్తుందో...

Tags:    

Similar News