ఆస్కార్‌ విన్నింగ్‌ డాక్యుమెంటరీ వివాదం

ఆర్థిక సహాయం కూడా పెద్ద మొత్తంలో అందినట్లుగా వార్తలు వచ్చాయి

Update: 2023-08-07 07:40 GMT

అనాథ ఏనుగులను సంరక్షించే దంపతుల వాస్తవ జీవనం ఆధారంగా 2022 లో రూపొందిన ఇండియన్ షార్ట్‌ ఫిల్మ్‌ 'ది ఎలిఫెంట్‌ విష్పరర్స్' 95వ ఆస్కార్‌ అకాడమీ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బెస్ట్‌ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకోవడంతో డాక్యుమెంటరీ లో కనిపించిన గిరిజన జంట బొమ్మన్‌, బెల్లి లు దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

తమిళనాడు ముఖ్యమంత్రి నుండి కూడా డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్ కార్తికి గోన్సాల్వేస్ మరియు బెల్లి, బొమ్మన్ లు ప్రశంసలు దక్కించుకున్నారు. ఆర్థిక సహాయం కూడా పెద్ద మొత్తంలో అందినట్లుగా వార్తలు వచ్చాయి. అంతా బాగానే ఉందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా బెల్లి, బొమ్మన్‌ లు మీడియా ముందుకు వచ్చి కార్తికి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది.

తమకు రావాల్సిన పారితోషికం ఇవ్వక పోవడంతో పాటు ఆస్కార్‌ ద్వారా వచ్చిన ఆదాయం ను కూడా తమకు ఇవ్వడం లేదు అంటూ వారు మీడియా ముందుకు వచ్చి మరీ ఆరోపించారు.

అంతే కాకుండా ఆస్కార్‌ అవార్డును కూడా కనీసం పట్టుకోనివ్వలేదు అన్నట్లుగా వారు ఆరోపిస్తున్నారను.

ఈ మొత్తం వ్యవహారంతో ఫిల్మ్‌ మేకర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌ అయిన కార్తికి గోన్సాల్వేస్‌ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గిరిజన జంట అవ్వడం వల్లే వారిని దూరంగా పెడుతున్నారా.. వారికి ఏమీ తెలియదు అని వారికి చెల్లించాల్సిన మొత్తం చెల్లించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరో వైపు కార్తికి మాత్రం వారి ఆరోపణలు కరెక్ట్‌ కాదు అంటూ వాదిస్తున్నారు. వారికి చెల్లాల్సిన మొత్తం చెల్లించినట్లుగా పేర్కొన్నారు. అంతే కాకుండా వారిని కావాలని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా కూడా కార్తికి ఆరోపించారు. మొత్తానికి ఈ వివాదం మెల్ల మెల్లగా పెద్దదిగా మారుతుంది. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News