15 ఏళ్ల‌కే అమ్మ తోడుతో ఆడిష‌న్ల‌కు వెళ్లిన బ్యూటీ!

ప‌వ‌న్ కేతిరాజు ద‌ర్శ‌క‌త్వం లో రూపొందిన చిత్ర‌మిది.

Update: 2024-09-28 21:30 GMT

ఇండ‌స్ట్రీకి కొత్త అమ్మాయిలు వ‌స్తే అదో ఉత్సాహం. ఎంత‌మంది వార‌సులున్నా? కొత్త ముఖాలు లేనిదే ప‌రిశ్ర‌మ క‌ళ క‌ళ‌లాడ‌దు. అందుకే ఏ ప‌రిశ్ర‌మ‌కైనా కొత్త అందాలు ఎప్పుడు కొంగొత్త‌గా ఉంటాయి. తాజాగా బాలీవుడ్ కి గ‌త ఏడాదే క‌శికా క‌పూర్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడా అమ్మ‌డు`లైఫ్` అనే చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ప‌వ‌న్ కేతిరాజు ద‌ర్శ‌క‌త్వం లో రూపొందిన చిత్ర‌మిది. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఈ సంద‌ర్భంగా అమ్మ‌డి గురించి కొన్ని విష‌యాలు. అమ్మ‌డు సినిమాల్లోకి రాక‌ముందే సాంప్ర‌దాయ నృత్యం క‌థ‌క్ లో శిక్ష‌ణ తీసుకుంది. జాతీయ స్థాయిలో స్విమ్మింగ్..త్రోబాల్..బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గోంది. కానీయాక్టింగ్ పై కూడా ఆస‌క్తి ఉడ‌టంతో తొలుత మోడ‌లింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ముంబైలోని ఓ స్టూడియోలో యాక్టింగ్ కోర్స్ పూర్తిచేసింది. 15 ఏళ్ల‌వ‌య‌సు నుంచే ఆడిష‌న్లు మొద‌లు పెట్టింది.

ఆ స‌మ‌యంలో వెంట త‌ల్లిని తీసుకెళ్లేదిట‌. 17 ఏళ్ల‌కే ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించ‌డం స్టార్ట్ చేసింది. `ఆయుశ్మ‌తీ గీత్ మెట్రిక్` అనే సినిమాతో బాలీవుడ్ లో ప‌రిచ‌యం అవుతుంది. వాస్త‌వానికి ఈ అమ్మ‌డు తెలుగులో `ట్రూలవ్` అనే సినిమాతో ప‌రిచ‌యం అవ్వాలి. కానీ ఆ సినిమా కంటేముందు `లైఫ్` రిలీజ్ అవుతుంది. గ‌త ఏడాది `ది వైబ్ హంట‌ర్స్` అనే వెబ్ సిరీస్ లో న‌టించింది. ఆ త‌ర్వాత అవ‌కాశాలు ఊపందుకున్నాయి.

అయితే త‌న‌కు ఫ‌లానా ప‌రిశ్ర‌మ‌లోనే న‌టించాల‌నే రూల్ పెట్టుకోలేదంటోంది. అవకాశం వ‌స్తే ఏ భాష‌లో నైనా న‌టించ‌డానికి సిద్దంగానే ఉన్న‌ట్లు తెలిపింది. ఇక అమ్మ‌డికి ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది 18.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అలాగే అమ్మ‌డికి వెకేష‌న్లు అంటే ఇష్టం అట‌. ఖాళీ స‌మ‌యం దొరికితే విదేశాల‌కు చెక్కేస్తుందిట‌.

Tags:    

Similar News