కశ్మీర్ రాజకీయాల్ని టార్గెట్ చేసిన మేకర్స్!
ఒకప్పుడు మేకర్స్ కశ్మీర్ అందాల్నే సినిమాల్లో చూపించారు. అక్కడ బ్యూటీని బేస్ చేసుకుని కథలు రాసి సినిమాలు తీసేవారు
ఒకప్పుడు మేకర్స్ కశ్మీర్ అందాల్నే సినిమాల్లో చూపించారు. అక్కడ బ్యూటీని బేస్ చేసుకుని కథలు రాసి సినిమాలు తీసేవారు.అక్కడ మంచు అందాలు.. ఆ బ్యూటీలో చెట్లు..కొండలు..ఇళ్లు..వాతావరణం ఎంతో అందంగా చూపించారు. మణిరత్నం 'రోజా'లో కశ్మీర్ అందంతో పాటు అక్కడ టెర్రరిజాన్ని కూడా చూపించి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకులు కశ్మీర్ వివాదాల్ని తెరపైకి తీసుకు రావడం మొదలు పెట్టారు.
ఆ మధ్య వివేక్ అత్నిహోత్రి రిలీజ్ చేసిక 'కశ్మీర్ ఫైల్స్' ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. కశ్మీర్ పండిపట్ల ఊచకోత అంశాన్ని హైలైట్ చేస్తూ తెరకెక్కించిన సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపించింది. తాజాగా రిలీజ్ అయిన 'ఆర్టికల్ 370' కూడా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లగా జరిగిన కశ్మీర్ పరిణామాలు..అక్కడ రాజకీయాల్ని ఆధారంగా చేసుకుని ఆర్టికల్ 370 రూపొందించారు ఆదిత్య సుహాస్.
యామీ గౌతమ్.. ప్రియమణి నటించిన ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలంటైన్' కూడా కశ్మీర్ పుల్వామా దాడి ఆధారంగానే రూపొందించారు. 2019లో జరిగిన పుల్వామా ఎటాక్ ఆధారంగా ఈ కథ అంతా సాగుతుంది. శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు సినిమాకి మంచి బజ్ ని తీసుకొచ్చాయి.
అలాగే తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తోన్న 'అమరన్' కూడా కశ్మీర్ నేపథ్యం తోనే రిలీజ్ అవుతుంది. 2014 లో జరిగిన కశ్మీర్ యుద్దాన్ని ఆధారంగా చేసుకుని రాజ్ కుమార్ పెరి యాస్వామి తెరకెక్కించారు. 200 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మించడం విశేషం. పుల్వామా దాడుల్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికే కొంత మంది బాలీవుడ్ మేకర్స్ కొన్ని చిత్రాలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.