16 ఏళ్లకు ఆ విషయాన్ని చెప్పిన స్టార్ హీరోయిన్
ఇండస్ట్రీలో మనుగడ సాగించాలి అంటే కొన్ని విషయాలను చూసి చూడనట్లుగా వదిలేస్తూ ఉండాలి
ఇండస్ట్రీలో మనుగడ సాగించాలి అంటే కొన్ని విషయాలను చూసి చూడనట్లుగా వదిలేస్తూ ఉండాలి. తమకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడితే ఉన్న అవకాశాలు కూడా పోతాయి అని చాలా మంది విషయంలో నిరూపితం అయ్యింది. పలు సందర్భాల్లో ఆ విషయం నిజమే అని తేలింది.
అందుకే చాలా మంది ముద్దుగుమ్మలు కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలో తమ గత అనుభవాలను, చేదు జ్ఞాపకాలను చెప్పేందుకు ఆసక్తి చూపించరు. ఆఫర్లు తగ్గిన తర్వాత, లేదంటే కెరీర్ లో పీక్స్ కు వెళ్లిన తర్వాత మాత్రమే ఆ విషయాలను చెప్పి తమ బాధను అంతా కూడా వెళ్లగక్కుతూ ఉంటారు.
ఇప్పుడు కత్రీనా కైఫ్ కూడా తనలో చాలా కాలంగా దాచుకున్న ఒక విషయాన్ని బయటకు చెప్పింది. 16 ఏళ్ల క్రితం తనకు జరిగిన అన్యాయం, మోసం ను ఇప్పుడు కత్రీనా మీడియా ముందుకు తీసుకు వచ్చింది. స్టార్ హీరో సినిమాలో ఎంపిక చేసి ఆ తర్వాత తొలగించిన విషయాన్ని కత్రీనా తాజాగా చెప్పుకొచ్చింది.
ఇటీవల కత్రీనా మాట్లాడుతూ... రణబీర్ కపూర్ హీరోగా నటించిన బచ్నా ఏ హసీనో చిత్రంలో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా నటించారు. మొదట కథ ప్రకారం ముగ్గురిని ప్రేమించి నాలుగో అమ్మాయిని హీరో పెళ్లి చేసుకుంటాడు. ఆ నాలుగో అమ్మాయి పాత్ర లో నేను నటించాల్సి ఉంది.
చివరి నిమిషంలో స్క్రిప్ట్ మార్చి నా పాత్రను పూర్తిగా లేపేశారు. దీపికా పదుకొనే తో ప్రేమలో పడి, చివరికి ఆమెను పెళ్లి చేసుకున్నట్లు గా చూపించారు. ఆ సినిమా నుంచే రణబీర్ కపూర్ మరియు దీపికా పదుకునే మధ్య ప్రేమ వ్యవహారం మొదలు అయినట్లు బాలీవుడ్ వర్గాల టాక్.
దీపికా తో బ్రేకప్ తర్వాత కత్రీనా తో రణబీర్ కపూర్ ప్రేమ వ్యవహారం సాగిందని హిందీ మీడియా కథనాలు అల్లాయి. ఇప్పుడు రణబీర్ తన భార్య ఆలియా తో కత్రీనా తన భర్త విక్కీ కౌశల్ తో వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎందుకు కత్రీనా ఈ విషయాన్ని బయటకు తీసుకు వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. 16 ఏళ్ల తర్వాత ఆమెకు ఈ విషయం గుర్తు రావడం విడ్డూరంగా ఉందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.