20 ఏళ్లగా నాకు నేనే పోటీ..విశ్రాంతి నా డైరీలో లేదు!
తాజాగా కత్రినా బాలీవుడ్ జర్నీ కి 20 ఏళ్లు ముగిసాయి. ఈ సందర్భంగా క్యాట్ జర్నీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కత్రినా కైఫ్ బాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'భూమ్' సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడి కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతుంది. కెరీర్ లో ఎన్నో జయాపజాలు చూసింది. ప్రస్తుతం సీనియర్ నాయికలతో పోటీ పడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. యువ నటుడు విక్కీ కౌశల్ ని ప్రేమ వివాహం చేసుకుని ధాంపత్య జీవితంలోనూ సంతోషంగా ఉంది.
వివాహానికి..ఫ్యామిలీ లైఫ్ కి సరిపడ్డ సమయాన్ని కేటాయించి కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తుంది. క్యాట్ కెరీర్ ఆరంభంలో 'మల్లీశ్వరి' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే తెలుగు నాట పాపులర్ అయింది. అటుపై 'అల్లరి ప్రియుడు' అనే మరో సినిమాలో కూడా నటించింది. కానీ కెరీర్ ని హిందీలోనే నిర్దేశించుకుంది. దీంతో తెలుగు పరిశ్రమకు దూరమైంది.
తాజాగా కత్రినా బాలీవుడ్ జర్నీ కి 20 ఏళ్లు ముగిసాయి. ఈ సందర్భంగా క్యాట్ జర్నీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. '20 ఏళ్ల సినీ జీవితంలో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నా. ఇన్నేళ్ల జర్నీలో నాతోనే పోటీ పడ్డా. ప్రతి సినిమాలో నా నటన నేనే పొల్చుకుంటా. బాగా చేసానా? లేదా? అని నాకు నేనే విశ్లేషిషించుకుంటా. నాధ్యాశంతా పనిపైనే ఉంటుంది. బుర్రలోకి మరో ఆలోచన రాకుండా పనిచేస్తా. విరామం అంటే అస్సలు నచ్చదు.
కొత్త ప్రయత్నాలకు నన్నునేనుగానే ప్రోత్సహించుకుంటా. ఆ విషయంలో నాకెంతో గర్వంగా అనిపిస్తుంది' అని అంది. ఇటీవలే కత్రినాకైఫ్-సల్మాన్ ఖాన్ జంటగా నటించిన 'టైగర్ -3' రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో క్యాట్ యాక్షన్ పాత్రలో అదరగొట్టింది. అమ్మడు ఖాతాలో మరో భారీ సక్సెస్ పడింది. దీంతో 'టైగర్ -4'ని కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి అందులో కత్రినాకి ఛాన్స్ ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.