రామ్ చరణ్ ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిన ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ!

ఇదంతా ఇప్పుడు రామ్ చరణ్ మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

Update: 2024-12-21 05:09 GMT

2024లో ఇండియన్ సినిమాలో టాలీవుడ్ హీరోలు డామినేషన్ చూపించారు. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. సౌత్ లోనే కాదు, నార్త్ బెల్ట్ లోనూ భారీ విజయాలను అందుకున్నారు. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ సాధించి, తమ స్టామినా ఎలాంటిదనేది చూపించారు. అన్నిటికంటే ముఖ్యంగా వీరంతా ఎస్.ఎస్. రాజమౌళి సపోర్ట్ లేకుండానే పాన్ ఇండియా మార్కెట్ ను క్యాప్చర్ చేశారు. ఇదంతా ఇప్పుడు రామ్ చరణ్ మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా వరల్డ్ వైడ్ గా 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో రెండుసార్లు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన ఫస్ట్ సౌత్ హీరోగా డార్లింగ్ ఘనత వహించారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవర పార్ట్-1' మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా 520 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో RRR తర్వాత సోలోగానే 500 కోట్ల క్లబ్ లో చేరిన హీరో అనిపించుకున్నారు తారక్.

ప్రస్తుతం 'పుష్ప 2: ది రూల్' సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ఆల్రెడీ 1500 కోట్ల క్లబ్ లో చేరింది. 'బాహుబలి 2' రికార్డును బ్రేక్ చేసే దిశగా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇక హిందీలో ఈ సినిమా చరిత్ర సృష్టించింది. 100 ఏళ్ల బాలీవుడ్ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇలాంటి టైంలో ఇప్పుడు రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.

సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన 'గేమ్ ఛేంజర్' సినిమా విడుదల కాబోతోంది. శంకర్ దర్శకత్వంలో ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా రూపొందుతోంది. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ముగ్గురు పాన్ ఇండియా స్టార్ హీరోలతో పోటీ పడాలంటే రామ్ చరణ్ కచ్ఛితంగా ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి తీరాలి. అందులోనూ RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఆయన తన తండ్రితో కలిసి చేసిన 'ఆచార్య' చిత్రం డిజాస్టర్ గా మారింది. కాబట్టి రాబోయే సినిమాతో భారీ విజయాన్ని సాధించి, తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాల్సిన అవసరం ఉంది.

'దేవర 1' తో రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి మిథ్ బ్రేకర్ అయ్యారు ఎన్టీఆర్. 'కల్కి' కంటే ముందు 'సలార్ 1' సినిమాతో ప్రభాస్ ఖాతాలో మరో సక్సెస్ ఉంది. మెగా ఫ్యామిలీకే చెందిన అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి లాంటి బెస్ట్ సీజన్ లో 'గేమ్ ఛేంజర్' తో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టకపోతే, మిగతా ముగ్గురు పాన్ ఇండియా హీరోల కంటే కాస్త వెనకబడినట్లే అవుతుంది. మరి గ్లోబల్ స్టార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అన్ ప్రిడిక్టబుల్ విక్టరీ సాధిస్తారో చూడాలి.

Tags:    

Similar News