సముద్ర తీరంలో కావ్య సొగసుల తాకిడి
ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు మంచి గుర్తింపుని అందుకున్న క్యూట్ నటి కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోయిన్ గా అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల లాంకావి వంటి అందమైన ద్వీపంలో తన విశ్రాంతి రోజులను ఆస్వాదిస్తూ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలకు "చుట్టూ అందమైన నీరు అమ్మలానే ఉంది" అని క్యాప్షన్ పెట్టి తన ప్రేమను వ్యక్తపరచింది. ప్రకృతి సౌందర్యంతో నిండిన ఈ ఫోటోలలో కావ్య తన తల్లితో కలిసి ఉన్న క్షణాలను షేర్ చేసుకుంది. ఒక ఫోటోలో ఆమె బోటులో కూర్చుని, లైఫ్ జాకెట్ ధరించి, నీటి మధ్యలో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ స్టిల్స్ ఇచ్చింది.
మరో ఫోటోలో, ఒక పెద్ద చెట్టు పై కూర్చుని, పచ్చని ఆకులతో నిండిన వాతావరణంలో, సంతోషంగా నవ్వుతూ కనిపిస్తోంది. సముద్ర తీరంలో నిల్చుని, నీలాకాశం మరియు పచ్చని పర్వతాల మధ్యలో ఆమె ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలలో ఆమె సింప్లిసిటీతో పాటు గ్లామర్నూ హైలెట్ చేసింది. ఇక కావ్య తన కెరీర్ను కూడా ఎంతో విభిన్నంగా, స్పెషల్ పాత్రలతో కొనసాగిస్తోంది.
“మసూద”, “బలగం” చిత్రాలతో టాలీవుడ్లో వరుసగా మంచి హిట్స్ అందుకుంది. అయితే ఇప్పటివరకు ఆమె కెరీర్ లో అవే చెప్పుకోదగిన సినిమాలు. మరికొన్ని సినిమాల్లో నటించింది గాని ఆ లెవెల్లో అయితే సక్సెస్ కాలేదు. ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అమ్మడు అవకాశాలు అయితే అందికుంటోంది. ఇక మంచి కంటెంట్ ఉన్న కథలు వస్తే గ్లామరస్ పాత్రలు చేయడానికి సిద్ధమే అన్నట్లు ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చింది.
ఇక చివరగా కావ్య కళ్యాణ్ రామ్ ఉస్తాద్ అనే సినిమాలో నటించింది. శ్రీసింహ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్కవ్వలేదు. ఇక ప్రస్తుతం ఒక రెండు చిన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే వెబ్ సీరీస్ లో నటించేందుకు కూడా కావ్య ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.