నార్త్ హీరోయిన్.. రండి అంటే ఏదో బూతు అనుకుందట

కానీ, ఇప్పుడు సక్సెస్‌తో సంబంధం లేకుండా చాలా మంది తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయిపోతున్నారు.

Update: 2024-10-26 20:30 GMT

సాధారణంగా సినిమా రంగంలో ఒకటి రెండు విజయాలను అందుకుంటేనే ఓ రేంజ్‌లో హైలైట్ అవుతూ ఉంటారు. అలాగే, మరిన్ని అవకాశాలను సైతం సొంతం చేసుకుంటూ ఉంటారు. కానీ, ఇప్పుడు సక్సెస్‌తో సంబంధం లేకుండా చాలా మంది తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయిపోతున్నారు. అలాంటి వారిలో ముంబై చిన్నది కావ్య థాపర్ ఒకరు.


2018లో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన కావ్య థాపర్.. ‘ఏక్ మినీ కథ’, ‘బిచ్చగాడు 2’ సినిమాలతో మరోసారి మెరిసింది. అప్పటి నుంచి వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ‘ఈగల్’, ‘ఊరు పేరు భైరవకోన’, ‘డబుల్ ఇస్మార్ట్’, ‘విశ్వం’ వంటి సినిమాలతో వచ్చి సత్తా చాటింది.

కొంత కాలంగా టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న కావ్య థాపర్.. విజయాలను మాత్రం ఆశించిన రీతిలో అందుకోవడం లేదు. అయినప్పటికీ ఓ రేంజ్‌లో ఆఫర్లను దక్కించుకుంటూ ఔరా అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కావ్య థాపర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంది.

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో కావ్య థాపర్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని కూడా పంచుకుంది. తన మొదటి సినిమా సందర్భంగా హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగు భాష రాకపోవడం వల్ల ఇబ్బందిని ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. ‘నేను మొదటి సినిమా షూట్‌లో పాల్గొన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ‘రండి మేడం. షాట్ రెడీ అయింది అని చెప్పడంతో స్టన్ అయిపోయాను’ అని చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత కావ్య థాపర్ కొనసాగిస్తూ.. ‘హిందీలో రండీ అంటే వ్యభిచార వర్కర్ అని అర్థం. అందుకే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను తిట్టారేమో అని పొరపాటు పడ్డాను. అందుకే వెంటనే నేను వెళ్లి నిర్మాతతో తన మీద కంప్లైంట్ చేశాను. అప్పుడాయన నవ్వుతూ.. మేడం ఇక్కడ రండి అంటే గౌరవం అయిన పదం. మిమ్మల్ని షూట్ కోసం రమ్మని పిలిచినట్లు అర్థం అని వివరించారు. దీంతో నేను నా తప్పును తెసుకున్నాను’ అని తెలిపింది.

మొత్తానికి భాష రాకపోవడం వల్ల కావ్య థాపర్ పడ్డ ఇబ్బంది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆమె దీని గురించి చెప్పడంతో ఇది హైలైట్ అవుతోంది. అదే సమయంలో ఇలా ఇప్పటికి ముంబై హీరోయిన్లు ఎంత మంది ఫీల్ అయి ఉంటారో అని పలువురు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News