కావ్య పాప.. ఎర్రటి చీరలో చందమామలా..

కావ్య కళ్యాణ్ రామ్ చాలా తక్కువ టైమ్ లోనే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది

Update: 2024-06-18 14:37 GMT

కావ్య కళ్యాణ్ రామ్ చాలా తక్కువ టైమ్ లోనే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. "బలగం" సినిమాలో ప్రియదర్శి జోడీగా నటించి మంచి పేరు సంపాదించిన ఈ నటి తన క్యూట్ లుక్స్ తోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. గతంలో "మసూద" సినిమాలో హీరోయిన్‌గా నటించినప్పటికీ, కావ్యకు "బలగం" తోనే పెద్ద గుర్తింపు వచ్చింది. ఇప్పుడు చిన్న, మధ్య తరహా చిత్రాలలో కూడా మంచి హిట్లు కొట్టాలని ప్రయత్నిస్తోంది ఈ యువ నటి.

అల్లు అర్జున్ "గంగోత్రి" సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమె కెరీర్ మొదలయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ "బాలు", చిరంజీవి "ఠాగూర్", ప్రభాస్ "అడవి రాముడు" వంటి సినిమాలలో కూడా నటించింది. ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి ఛాన్సులు వచ్చినప్పటికీ, ఆమె తన చదువులకు ప్రాధాన్యం ఇచ్చింది. 2008 నుంచి చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటూ ఎడ్యుకేషన్ ను పూర్తిచేసింది.

చదువు ముగిసిన తర్వాత, మళ్లీ సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆడిషన్లు ఇవ్వడం ప్రారంభించింది. అలా "మసూద" సినిమాతో నాయికగా టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇచ్చింది కావ్య. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత "బలగం" సినిమాలో నటించి మరింత పేరు తెచ్చుకుంది. అనంతరం సింహా కోడూరి హీరోగా నటించిన "ఉస్తాద్" సినిమాలో కూడా తన ప్రతిభను చూపించింది.

అయితే ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయవంతం కాలేదు. ప్రస్తుతం ఆమెకు పలు ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. త్వరలోనే కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేయనుంది కావ్య. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ, అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవలి కాలంలో ఫోటోషూట్స్ చేస్తూ తన గ్లామర్ ను చూపిస్తోంది. రీసెంట్ గా నల్ల రైక, ఎర్ర చీర కట్టుకుని బ్యూటీఫుల్ గా ఎట్రాక్ట్ చేసింది. ఆ ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫోటోలలో కావ్య క్యూట్ పోజులిచ్చి అందరినీ ఫిదా చేసింది. అభిమానులు పాజిటివ్ గా కామెంత్ చేస్తూ ఆమె గ్లామర్ ను ప్రశంసిస్తున్నారు. ఇక ఆమె ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందమే అంటూ మరికొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ బ్యూటీ మంచి కంటెంట్ ఉన్న ప్రాజెక్టులు వస్తే గ్లామర్ రోల్స్ కూడా చేయాలని అనుకుంటోంది. వీలైనంత వరకు డిఫరెంట్ ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకుంటున్న కావ్య స్టార్ హీరోలతో కూడా ఛాన్స్ లు అందుకోవాలి అని ప్రయత్నం చేస్తోంది. మరి రాబోయే రోజుల్లో అమ్మడికి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి.

Tags:    

Similar News