కీరవాణికి నిద్రలేకుండా చేసిన చంద్రముఖి
తెలుగు చిత్రసీమలో ఎన్నో మరపురాని సూపర్ హిట్ సాంగ్స్‌ను అందించి సినీ ప్రియులు, శ్రోతల మదిలో చెరగిపోని ముద్ర వేసుకున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి.
తెలుగు చిత్రసీమలో ఎన్నో మరపురాని సూపర్ హిట్ సాంగ్స్‌ను అందించి సినీ ప్రియులు, శ్రోతల మదిలో చెరగిపోని ముద్ర వేసుకున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి. మరకత మణిగా తమిళంలో, ఎమ్.ఎమ్.క్రీమ్‌గా హిందీలోనూ ఎంతో మంది శ్రోతలను ఉర్రూతలూగించారు. రీసెంట్గా 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాన్ని అందుకుని ఆస్కీరవాణిగా.. మరింత ఉన్నత స్థానాన్ని అందుకన్నారు.
అయితే తాజాగా ఈ మధుర రాగాల మాంత్రికుడు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అభిమానుల్లో జోష్‌ను నింపారు. తాను రెండు నెలల పాటు నిద్రలేకుండా ఓ సినిమా కోసం బాగా కష్టపడినట్లు చెప్పుకొచ్చాు. ఆ చిత్రానికి ఎంతో అద్భుతంగా సంగీతం అందించినట్లు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి 'చంద్రముఖి 2'. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ఓ తాజా అప్డేట్ను తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా చెప్పారు. సినీ ప్రియుల్లో మరింత ఆసక్తి రేకెత్తించారు.
చంద్రముఖి 2 తొలి కాపీని చూసి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. "ఈ చిత్రంలోని పాత్రలు చావు భయంతో నిద్రలేని రాత్రులను గడుపుతాయి. ఆ అద్భుతమైన సీన్స్ కోసం నేను 2 నెలల పాడు నిద్రపోకుండా సంగీతం అందించాను" అని కీరవాణి చెప్పారు. అలాగే సంగీత దర్శకులు గురుకిరణ్, విద్యాసాగర్ ల ఆశీస్సులను కోరారు.
ప్రస్తుతం కీరవాణి చేసిన పోస్ట్ చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. 'చంద్రముఖి 2 కోసం, ఈ చిత్రానికి మీరు అందించిన బీజీఎమ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటాము. లక. లక, లక' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన చంద్రముఖికి సీక్వెల్‌గా ఈ రెండో భాగం రూపొందుతోంది. 2005లో రిలీజైన ఈ చిత్రం మంచి హిట్ ను అందుకుంది. ఈ రెండు చిత్రాలకు పి. వాసు దర్శకత్వం వహించారు. రెండో భాగంలో రాఘవ లారెన్స్ నటించారు. రాజ నర్తకిగా బాలీవుడ్ కాంట్రవర్సీ యాక్టర్ కంగనా రనౌత్ నటించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.