సెట్లో చిరు గారే..అన్నయ్య అంటే కొట్టేవారేమో!
మెగాస్టార్ చిరంజీవి ని అన్నయ్య అంటూ ఎంతో అభిమానంతో పిలుచుకుంటారు. అభిమానులే కాదు ఆయన స్పూర్తితో ఇండస్ట్రీకొచ్చి ఎదిగిన వారంతా కూడా అన్నయ్య అని పిలుస్తారు.
మెగాస్టార్ చిరంజీవి ని అన్నయ్య అంటూ ఎంతో అభిమానంతో పిలుచుకుంటారు. అభిమానులే కాదు ఆయన స్పూర్తితో ఇండస్ట్రీకొచ్చి ఎదిగిన వారంతా కూడా అన్నయ్య అని పిలుస్తారు. మరికొంత మంది చనువుతో బాస్ అని పిలుచుకుంటారు. ఎవరి నోటైనా అన్నయ్య అనే పదం వినిపించిందంటే? అది చిరంజీవి అని వెలిగిపోతుంది. చిరంజీవి స్పూర్తితో పరిశ్రమలో ఎదిగిన వారంతా అన్నయ్య..బాస్ అంటూ నిత్యజపం చేస్తూనే ఉంటారు.
మరి హీరోయిన్లు చిరుని ఎలా సంబోధిస్తారు? అంటే చాలా మంది సర్ అనే అంటారు. ఇండస్ట్రీలో హీరోని అన్నయ్య అని పిలవడం కష్టమైన పని. అందుకు చాలా కారణాలుంటాయి. ముఖ్యంగా ఓ సినిమా ఇద్దరు జంటగా నటిస్తారు. అందులో కొంత రొమాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు బయట అన్నయ్య అని పిలవడం ఇబ్బందికరమైన సన్నివేశం. అది సినిమా? అయినా బయటా అన్నయ్య అనే పిలుపు ఆమోదయోగ్యంగా ఉండదని భావిస్తారు.
మరి కీర్తి సురేష్ ..చిరుని ఏమని సంబోధించేవారో? తెలుసా? ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ` భోళా శంకర్ లో చిరంజీవి చెల్లిగా నటించా. సెట్లో ఎప్పుడూ ఆయన్ని చిరు గారే అనే పిలిచేదాన్ని..ఒకవేళ అన్నయ్యా అంటే కొడతారేమోనని సందేహం. అందుకే ఎందుకొచ్చిన ఇబ్బందని చిరు గారు అని పిలిచేదాన్ని. ఈ సినిమాకి పనిచేసినంత కాలం క్యారేజ్ నాకు చిరు సర్ ఇంటి నుంచే వచ్చేది.
సెట్లో ఎప్పుడు ఆయన ఇంటి భోజనం గురించే మాట్లాడేదాన్ని. ముఖ్యంగా ఆయన ఇంటి ఉలవచారు చాలా రుచికరంగా ఉంటుంది. దాంతో అన్నం లాగించేసేదాన్ని. షూటింగ్ ఉన్నని రోజులు మంచి భోజనం తిన్నాను. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. ఈసినిమా ద్వారా ఎన్నో మంచి జ్ఞాపకాలు ఏర్పడ్డాయి. చిరు సర్ ఎంతో సరదాగా ఉంటారు. తెలియని విషయాన్ని ఎంతో ఓపికతో చెబుతారు. ఎంతో ప్రశాంతంగా ఉంటారు. అది నాకు ఆయనలో బాగా నచ్చే గుణం` అని అంది.