కీర్తి ఇక గ్లామర్ టచ్చింగులే.. ఎందుకంటే..?

ఇన్నాళ్లు సౌత్ లో స్కిన్ షోకి కాస్త మొహమాట పడిన కీర్తి సడెన్ గా బీ టౌన్ వెళ్లగానే తన పంథా మార్చేసింది.

Update: 2025-02-21 02:45 GMT

మహానటి కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కెరీర్ పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఇన్నాళ్లు సౌత్ లో కథానాయికగా మెప్పించిన అమ్మడు బేబీ జాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో కీర్తి సురేష్ ఎప్పుడు లేని విధంగా గ్లామర్ షోతో అదరగొట్టేసింది. ఇన్నాళ్లు సౌత్ లో స్కిన్ షోకి కాస్త మొహమాట పడిన కీర్తి సడెన్ గా బీ టౌన్ వెళ్లగానే తన పంథా మార్చేసింది. బాలీవుడ్ లో కేవలం యాక్టింగ్ తోనే మెప్పించడం అన్నది చాలా కష్టం.

అందుకే అక్కడికి వెళ్లిన భామలంతా కూడా గ్లామర్ క్వీన్ గా మారుతుంటారు. బేబీ జాన్ కోసం కీర్తి చేసిన థై షో స్పెషల్ డిస్కషన్ కి దారి తీసింది. ఐతే పెళ్లి తర్వాత మామూలుగా అయితే ఏ హీరోయిన్ అయినా గ్లామర్ షో తగ్గిస్తారు. కానీ కీర్తి మాత్రం రివర్స్ లో ఆఫ్టర్ మ్యారేజ్ రెచ్చిపోతుంది. ఈ తికమక కాస్త కన్ ఫ్యూజ్ గానే ఉన్నా ఇదంతా కీర్తి సురేష్ ఒక ప్లాన్ ప్రకారమే చేస్తుందని తెలుస్తుంది.

కీర్తి సురేష్ ప్లాన్ ప్రకారం పెల్లైన తర్వాత ఆఫర్లు కష్టంగా ఉంటాయి. ముఖ్యంగా గ్లామర్ షో చేయాల్సి వస్తుంది. అదే ముందుగానే గ్లామర్ షోకి రెడీ అనే హింట్ ఇస్తే అన్ని రకాల పాత్రలు వస్తాయి. ఈ విషయాన్ని కనిపెట్టిన అమ్మడు బేబీ జాన్ లో అందాలతో అదరగొట్టేసింది. కీర్తి సురేష్ ఈ నయా ప్లాన్ ఆమెకు ఏమేరకు మైలేజ్ తెచ్చి పెడుతుందో చూడాలి.

ప్రస్తుతం అమ్మడు తమిళ్ లో రెండు సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి రివాల్వర్ రీటా కాగా మరోటి కన్నివేడి. ఇవే కాదు బేబీ జాన్ లో అమ్మడి గ్లామర్ షో చూసిన బాలీవుడ్ మేకర్స్ కీర్తి సురేష్ కి ఆఫర్లు ఇస్తున్నారట. సౌత్ లో మహానటి గా మెప్పించి నేషనల్ అవార్డు సైతం దక్కించుకున్న కీర్తి సురేష్ నార్త్ ఆడియన్స్ కోసం మాత్రం తన అందాల ప్రదర్శనకు రెడీ అయ్యింది. బేబీ జాన్ అమ్మడికి అంత ఎంకరేజింగ్ ఇవ్వకపోయినా బాలీవుడ్ నుంచి బాగానే అవకాశాలు అందుకుంటుందని టాక్. ఇక అమ్మడి తెలుగు సినిమాల విషయానికి వస్తే చిరంజీవి తో భోళా శంకర్ తో ఫ్లాప్ ఫేస్ చేసిన అమ్మడు మరో ఛాన్స్ అందుకోలేదు. ఐతే తెలుగులో ఎలాంటి ఆఫర్ వచ్చినా అమ్మడు రెడీ అనేస్తుంది.

Tags:    

Similar News