డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నటి చెప్పిన చేదు నిజం
ఆమె నివాసానికి చేరుకోగా టేబుల్‌పై 2 ప్యాకెట్ల ఎండిఎంఎ పడి ఉందని ఎస్‌ఐ విజయకుమార్ తెలిపారు.
రేవ్ పార్టీల్లో డ్రగ్స్ వినియోగం గురించి చాలా సమాచారం పోలీసుల వద్ద ఉంది. ఇంతకుముందు కొందరు తెలుగు నటీమణులు, టీవీ రంగానికి చెందిన నటీనటులు కూడా ఈ కేసులో పట్టుబడ్డారు. సెలబ్రిటీల రేవ్ పార్టీల గురించి చాలా భయానక నిజాలను మీడియాలు బయటపెట్టాయి. కేరళలో అలాంటి ఒక నటీమణికి సంబంధించిన కేసులో కొన్ని నిజాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.
కేరళ టీవీ నటి ఒకరు 2 గ్రాముల MDMAతో అరెస్ట్ కావడంతో ఇది బయటపడింది. MDMA స్వాధీనం చేసుకున్నందుకు కేరళకు చెందిన టెలివిజన్ నటిని పరవూరు పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. 34 ఏళ్ల టెలివిజన్ స్టార్ షమ్నాత్ కొల్లాంలోని ఓజుకుపరాలోని తన నివాసంలో 2 గ్రాముల ఎండిఎంఏ తో పట్టుబడ్డారు. ఆమె గత 2-3 సంవత్సరాలుగా డ్రగ్స్ సేవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆమె డ్రగ్స్ వాడుతున్నట్లు పక్కా సమాచారం అందిందని, ఆమె నివాసానికి చేరుకోగా టేబుల్‌పై 2 ప్యాకెట్ల ఎండిఎంఎ పడి ఉందని ఎస్‌ఐ విజయకుమార్ తెలిపారు. తన డిప్రెషన్‌ను నయం చేసేందుకు మందు వాడుతున్నట్లు షమ్నాత్ పేర్కొంది. నిందితురాలిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఆమె కొన్నేళ్లుగా డ్రగ్స్ ని సేవిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కెరీర్ పరమైన ఒత్తిళ్లకు తలవొంచి నటీమణులు డ్రగ్స్ మహమ్మారీ భారిన పడుతున్నారని కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు.