చివ‌రికి స్టార్ హీరోని కాపాడే ఏకైక సినిమా ఇదేనా?

ఇప్పుడు అదే క‌థ‌తో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ప్ర‌యోగాత్మ‌కంగా రూపొందించిన `కేస‌రి 2` విడుద‌లకు సిద్ధ‌మ‌వుతోంది.

Update: 2025-02-16 06:50 GMT

చ‌రిత్ర పుస్త‌కాల్లో జ‌లియ‌న్ వాలాబాగ్ దురంతం గురించి చ‌దువుకున్నాం. ఈ చారిత్ర‌క ఘ‌ట్టం ఉద్వేగానికి గురి చేస్తుంది. అలాంటి కిరాత‌క చ‌ర్య ఎన్న‌టికీ స‌హించ‌లేనిది. భార‌తీయుల‌పై ఆంగ్లేయుల ఘాతుకాల్లో ఇది అత్యంత కీల‌క ప‌రిణామంగా రూపాంత‌రం చెందింద‌ని చ‌రిత్ర‌కారులు చెబుతారు.

జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్య్ర‌ ఉద్యమ సమయంలో అహింసాత్మకంగా సమావేశం నిర్వహిస్తున్న స్వాతంత్య్ర‌ వీరులపై బ్రిటిషు వారు జరిపిన ఊచకోత. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట. 1919 ఏప్రిల్ 13 న బ్రిటిషు సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. ఉద్య‌మ స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్ని అట్టుడికించింది. ఈ ఘ‌ట‌న‌పై అప్ప‌ట్లో కోర్టు విచార‌ణ‌లు జ‌రిగాయి.

ఇప్పుడు అదే క‌థ‌తో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ప్ర‌యోగాత్మ‌కంగా రూపొందించిన `కేస‌రి 2` విడుద‌లకు సిద్ధ‌మ‌వుతోంది. కరణ్ సింగ్ త్యాగి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం కోర్ట్ రూమ్ డ్రామా నేప‌థ్యంలో సాగుతుంది. 18 ఏప్రిల్ 2025న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అక్షయ్ న‌టించిన కేస‌రి (2019) చిత్రానికి సీక్వెల్ అని చెబుతున్నా.. ఇది పూర్తిగా విభిన్న క‌థ‌తో రూపొందించిన సినిమా. జలియన్ వాలాబాగ్ ఊచకోతలో ప్రజలకు తెలియని సంఘటనకు సంబంధించిన వాస్తవాలను తెరపై చూపిస్తున్నారు. ప్రధాన కథ 1919లో జ‌రుగుతుంది. న్యాయవాది, స్వాతంత్య్ర‌ సమరయోధుడు సర్ చెత్తూర్ శంకరన్ నాయర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆర్. మాధవన్, అనన్య పాండే ఇందులో కీల‌క పాత్ర‌ధారులు. ఫస్ట్ లుక్ వచ్చే నెలలో విడుదల కానుంది. జలియన్ వాలాబాగ్ మారణహోమం జరిగి 106 వ వార్షికోత్సవం సందర్భంగా అదే వారంలో విడుదల తేదీని నిర్ణయించారు.

కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత అక్ష‌య్ కుమార్ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. జ‌యాప‌జ‌యాల్ని కాలం నిర్ణ‌యిస్తుంది. అక్ష‌య్ న‌టించిన కొన్ని రియ‌లిస్టిక్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. అత‌డికి బ్యాడ్ టైమ్ ర‌న్ అవుతున్న ఈ స‌మ‌యంలో ఇది గుడ్ టైమ్ తేవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా త‌ర్వాత మరో కోర్టు రూమ్ డ్రామా జాలీ ఎల్‌.ఎల్‌.బి3 లోను అత‌డు న‌టించాల్సి ఉంది. ఇది కూడా ఈ సంవత్సరం విడుదలవుతుంది.

Tags:    

Similar News