ఖుష్బూ చేతికి గాయాలు.. అసలేమైందంటే
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఖుష్బూ గాయాల పాలైనట్టు తెలుపుతూ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సీనియర్ హీరోయిన్ ఖుష్బూ పలు విధాలుగా మంచి పేరు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా, పొలిటీషియన్ గా ఆమె బాగా పాపులరైంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఖుష్బూ గాయాల పాలైనట్టు తెలుపుతూ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన ఖుష్బూ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.
ముఖ్యంగా తన ఎడమ చేతిని చూపిస్తూ ఆ చేతికి అయిన గాయాల ఫోటోలను ఖుష్బూ పోస్ట్ చేసింది. అయితే ఖుష్బూ గత కొంతకాలంగా కండరాల ఎలర్జీకి గురై తీవ్ర నొప్పితో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. మామూలుగా స్పోర్ట్స్ పర్సనాలిటీస్ హార్డ్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల ఇలాంటి కండరాల ఎలర్జీతో బాధ పడుతూ ఉంటారు.
ఇప్పుడు ఖుష్బూ కూడా అలాంటి సమస్యతోనే బాధ పడుతుందని సమాచారం. గతంలో చాలా బొద్దుగా ఉండే ఖుష్బూ తన వర్కవుట్స్ తో చాలా స్లిమ్ గా మారిన విషయం తెలిసిందే. అందుకే ఆమెకు ఇప్పుడు ఈ సమస్యతో బాధ పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఖుష్బూ చేతికి డాక్టర్లు ఫిజియోథెరపీ చేస్తున్నారు.
అయితే ఇంత బాధలో కూడా ఖుష్బూ షూటింగుల్లో పాల్గొంటుందట. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమెకి సలహాలిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో అవకాశాలందుకుంటూ ప్రేక్షకుల్ని అలరించిన ఖుష్బూ ఈ మధ్య జబర్దస్ కు జడ్జిగా వ్యవహరిస్తూ తన కామెడీతో అందరినీ ఆకట్టుకుంటుంది.
కమెడియన్స్ తో కలిసి జోకులేస్తూ జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించింది ఖుష్బూ. తన భర్త సుందర్ కూడా నటుడిగా, డైరెక్టర్ గా మంచి పేరు దక్కించుకున్నాడు. ఎక్కువగా హార్రర్ సినిమాలను తీస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ ఉంటాడు సుందర్. ఇదిలా ఉంటే ఖుష్బూ తన కూతుళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ప్రయత్నిస్తున్నట్టు ఈ మధ్య వార్తలొస్తున్నాయి.